సినీ ప్రముఖులకు పోలీసుల సీక్రెట్ వార్నింగ్స్..?

Tue Sep 14 2021 08:00:01 GMT+0530 (IST)

Police secret warnings to movie celebrities

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న విషయాలలో డ్రగ్స్ కేసు ఒకటైతే.. యువ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం మరొకటి. డ్రగ్స్ వ్యవహారం - రోడ్ యాక్సిడెంట్ అనేవి రోజూ ఎక్కడో ఒక చోట జరిగే విషయాలే అయినప్పటికీ.. ఇక్కడ సినీ ప్రముఖులు ఉండటంతో వీటిపై మీడియా ఎక్కువ దృష్టి పెట్టింది.నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి విచారిస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో పలువురు సినీ ప్రముఖులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక వినాయక చవితి రోజు బైక్ మీద వెళ్తున్న మెగా హీరో సాయి తేజ్.. రోడ్డుపై ఉన్న ఇసుక వల్ల స్కిడ్ అయి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ క్రమంలో మీడియా - సోషల్ మీడియాలో సాయి తేజ్ రోడ్డు ప్రమాదం గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏది నిజమో ఏది ఊహాగానాలో తేల్చుకోలేనంతగా డ్రగ్స్ కేసు - తేజూ యాక్సిడెంట్ మీద వార్తలు వచ్చాయి. ఇందులో నిజానిజాలు ఎంటనేది పక్కన పెడితే ఈ రెండు విషయాల్లో సినీ ప్రముఖులే ఎక్కువ టార్గెట్ అయ్యారు.  

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు.. వారి యంగ్ కిడ్స్ కి సన్నిహిత పోలీసుల నుంచి సీక్రెట్ వార్నింగ్స్ వెళ్తున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మీడియాకి టార్గెట్ అయ్యే విధంగా ఎలాంటి పనులు చేయొద్దని.. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని పోలీసులు వారికి హితవు పలికినట్లుగా చెప్పుకుంటున్నారు.