Begin typing your search above and press return to search.

మూడో దృశ్యం పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 Nov 2022 5:41 AM GMT
మూడో దృశ్యం పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారా?
X
మ‌ల‌యాళం సినిమా 'దృశ్యం' మాతృభాష స‌హా త‌మిళ్..తెలుగు...హిందీ భాష‌ల్లో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. మ‌ల‌యాళం కంటెంట్ పాన్ ఇండియా వైడ్ ఈ రేంజ్ లో ఫేమ‌స్ అవ్వ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. రీమేక్ వెర్ష‌న్కి భాష‌ని బ‌ట్టి వేర్వేరు ద‌ర్శ‌కులు ప‌నిచేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం అన్నిచోట్లా ఒకేలా వ‌చ్చింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు భాగాలు మాతృక‌ను మించి తెలుగు..హిందీ భాష‌ల్లో పెద్ద స‌క్సెస్ సాధించాయి.

మాతృక‌లో మోహ‌న్ లాల్ ..త‌మిళ్ లో క‌మ‌ల్ హాస‌న్..తెలుగులో వెంక‌టేష్‌..హిందీలో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే హిందీ వెర్ష‌న్ కూడా రిలీజ్ అయి భారీ విజ‌యాన్ని సాధించింది.

ఈ నేప‌థ్యంలో దృశ్యం మూడ‌వ భాగాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఒరిజిన‌ల్ వెర్ష‌న్ క‌థ సిద్ద‌మైంది. మిగ‌తా భాష‌ల్లో కూడా క‌థ‌సిద్దం చేసి అన్ని చోట్లా ఒకేసారి షూటింగ్ మొద‌లు నుంచి రిలీజ్ కూడా ఒకేసారి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

హిందీ వెర్ష‌న్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ అభిషేక్ పాఠ‌క్ కూడా ఇదే మాట‌ని స‌మ‌ర్ధించారు. మూడో సినిమా కోసం ప్రేక్ష‌కుల నుంచి గ‌ట్టిగానే డిమాండ్ వ్య‌క్తం అవుతోంది. ప్రేక్ష‌కుల్ని క‌థ‌తో మ‌రింత థ్రిల్ కి గురి చేయాలి. క‌థ విష‌యంలో ఈసారి ఇంకా ప‌క‌డ్భందీగా వ్య‌వ‌హ‌రించాలి. సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం.

వారు ఆస‌క్తి చూపించిన‌ప్పుడు మ‌నం సినిమాలు ధైర్యంగా చేయాల‌న్నారు. తెలుగు దృశ్యం-2 నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ పాండ‌మిక్ స‌మ‌యంలో థియేట‌ర్ రిలీజ్ ఇబ్బంది క‌రంగా మార‌డంతో నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.

దృశ్యం తెలుగు వెర్ష‌న్ మొద‌టి భాగానికి శ్రీప్రియ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ..రెండ‌వ భాగానిక మాత్రం జీతు జోసెఫ్‌నే ఆ బాధ్య‌త‌లు తీసుకున్నారు. తెలుగులో భారీ విజ‌యం సాధించ‌డంతోనే మాతృక ద‌ర్శ‌కుడు రంగంలోకి దిగారు. మ‌రి మూడ‌వ భాగం విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.