పిక్ టాక్ : టెక్ రారాజు తో సూపర్ స్టార్

Wed Jun 29 2022 12:00:01 GMT+0530 (IST)

Pick Talk: Superstar with Bill Gates

ప్రపంచ మొత్తం సుపరిచితుడు అయిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉండే బిల్ గేట్స్ తన దాతృత్వంను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటాడు. ఆయన వేల కోట్ల ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతలు ఆయన్ను కలిశారు.ప్రస్తుతం హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యామిలీ అమెరికాలో న్యూజెర్సీ లో బిల్ గేట్స్ ను కలిశారు. ఆ సందర్బంగా ఆయనతో పలు విషయాలను మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసి బిల్ గేట్స్ వంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నట్లుగా కామెంట్ పెట్టాడు.

ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అయిన బిల్ గేట్స్ ను కలిసినందుకు గాను చాలా సంతోషంగా ఉందని.. ఆయన ఎంతో హుందాగా ఉన్నారు. ఆయన ఎంతో ఆదర్శవంతుడు అన్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నాడు.

మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మహేష్ బాబు మరియు బిల్ గేట్స్ భేటీకి కారణం ఏంటీ అనేది మాత్రం తెలియరాలేదు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లు బాగానే రాబట్టింది. ఇక త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ను చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించబోతున్నారు. 2024 వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని జక్కన్న భావిస్తున్నాడట. కాని జక్కన్న మూవీ అంటే మినిమం టైమ్ పడుతుంది కనుక.. 2025 వరకు వచ్చినా కూడా హ్యాపీనే అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.