Begin typing your search above and press return to search.

బ్లాక్ లుక్ లో కొల్ల‌గొట్టిన శ్రీ‌ముఖి

By:  Tupaki Desk   |   4 Oct 2022 2:30 AM GMT
బ్లాక్ లుక్ లో కొల్ల‌గొట్టిన శ్రీ‌ముఖి
X
బుల్లితెర‌పై సుదీర్ఘ కాలం టాప్ యాంక‌ర్ గా రాణించిన శ్రీ‌ముఖి ఇటీవ‌ల పెద్ద తెర న‌టిగానూ అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే.
అందానికి అందం ప్ర‌తిభ చొర‌వ శ్రీ‌ముఖి సొంతం. అందుకే యాంక‌ర్ గా ఇండ‌స్ట్రీలో ఎదురే లేకుండా కొన‌సాగింది. ఇటీవ‌ల ఇత‌ర యాంక‌ర్ల బాట‌లోనే శ్రీ‌ముఖి పెద్ద తెర కెరీర్ పై పెద్ద రేంజులో దృష్టి సారించింద‌ని తెలిసింది.

శ్రీముఖి ఎప్ప‌టికప్పుడు బుల్లితెర‌పై లేటెస్ట్ షోల‌తో సంద‌డి చేస్తోంది. ఇంత‌కుముందు జీ-తెలుగు సరేగమపలో సంద‌డి చేసింది. ప‌లు టీవీ షోల‌తో శ్రీ‌ముఖి బిజీగా ఉంది. పెద్ద తెర‌పై బిజీ అయ్యే క్ర‌మంలో టీవీ స్క్రీన్ కి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లోనూ ఈ భామ ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

దీంతో పాటు సోష‌ల్ మీడియాల్లో ఈ బ్యూటీ చెల‌రేగి ఆర‌బోస్తోంది. తాజాగా బ్లాక్ లుక్ లో స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఈ లుక్ చూడ‌గానే కుర్రాళ్లలో హీట్ రాజుకుంటోంది. బ్లాక్ సూట్ కి కాంబినేష‌న్ గా మెడ‌లో డార్క్ గ్రీన్ క్రిస్ట‌ల్స్ తో డిజైన్ చేసిన ఆభ‌ర‌ణాన్ని ధ‌రించిన ఈ బ్యూటీ చెవుల‌కు కాంబినేష‌న్ గ్రీన్ జూకాల‌ను ధ‌రించింది. మొత్తానికి శ్రీ‌ముఖి స‌రికొత్త రూపం యూత్ గుండెల్లో స్టిక్ అయిపోయింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... `ప్రేమ ఇష్క్ కాద‌ల్` చిత్రంతో స‌క్సెస్ అందుకుంది టీవీ యాంకర్ శ్రీముఖి. ప‌లువురు యువ‌తార‌ల‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాలో శ్రీ‌ముఖి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాతా అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తున్నా బిగ్ బ్రేక్ కోసం వేచి చూస్తోంది. ఇటీవ‌ల‌ విడుదలైన క్రేజీ అంకుల్స్ న‌టిగా పేరు తెచ్చింది. ప్ర‌స్తుతం కొన్ని చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్ లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ఇక మూడు రాజధానులు అంటూ వైసీపీ చెబుతున్నా అందులో ఎక్కువగా విశాఖను ఫోకస్ చేస్తున్నారు. అదే విధంగా
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.