Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రోమ్‌ లో రాఖీ భాయ్ భార్యతో చక్కర్లు

By:  Tupaki Desk   |   13 Aug 2022 7:22 AM GMT
పిక్ టాక్ : రోమ్‌ లో రాఖీ భాయ్ భార్యతో చక్కర్లు
X
కేజీఎఫ్‌ తో పాన్ ఇండియా స్టార్‌ గా నిలిచిన యశ్ తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆయన భార్య పిల్లలతో విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా యశ్ రోమ్‌ వీదుల్లో భార్య రాధిక పండిట్ చేయి పట్టుకుని ఇలా చక్కర్లు కొట్టడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం జరిగింది.

యశ్ మరియు రాధిక లు ఫుల్ హాలీడే మూడ్ లో ఉన్నారు. యశ్ గత రెండు నెలలుగా ఫ్యామిలీతో ట్రిప్‌ లో ఉన్నారు. యశ్‌ మరియు రాధిక లు రెగ్యులర్ గా షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్న యశ్‌ తిరిగి వచ్చిన తర్వాత సినిమా కు సంబంధించిన చర్చల కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశం ఉందంటున్నారు.

కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్థాయి లో యశ్ స్టార్ డమ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తో యశ్‌ తదుపరి సినిమా కూడా అదే స్థాయి లో ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో యశ్ సినిమాకు సంబంధించిన చర్చలు చాలా కాలంగా సాగుతున్నాయి.

యశ్‌ హీరోగా ఒక హిందీ సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యశ్‌ కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఒక భారీ యాక్షన్‌ సినిమాను ప్లాన్ చేశాడని.. త్వరలోనే యశ్‌ తో కథా చర్చలు ఉంటాయని కన్నడ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.