పిక్ టాక్: మిషన్ కోసం మారువేషంలో 'రాజా విక్రమార్క'

Wed Jul 21 2021 12:28:45 GMT+0530 (IST)

Pic Talk: 'Raja Vikramarka' in disguise for mission

'Rx 100' ఫేమ్ కార్తీకేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ''రాజా విక్రమార్క''. శ్రీ సరిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - కాన్సెప్ట్ వీడియో - ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు బక్రీద్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని 'రాజా విక్రమార్క' నుండి ఆసక్తికరమైన పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఇందులో కార్తికేయ ముస్లిం యువకుడిగా తలకు తెల్లటి క్యాప్ ధరించి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. NIA అధికారి అయిన హీరో.. ఏదో మిషన్ కోసం ఇలా మారువేషం వేసుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ పాత్ర కోసం కార్తికేయ భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఈ సినిమాతో కన్నడ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

ఇందులో సాయి కుమార్ - తనికెళ్ళ భరణి - సుధాకర్ కోమాకుల - పశుపతి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ ప్రశాంత్ ఆర్ విహారి ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. పి.సి.మౌళి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. టి.ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'చావు కబురు చల్లగా' సినిమాతో ప్లాప్ అందుకున్న కార్తికేయ.. మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ ''రాజా విక్రమార్క'' తో హిట్ అందుకుంటాడేమో చూడాలి.