పిక్ టాక్ : చీర కట్టులోనూ అదే అందం బాబోయ్

Sat Aug 06 2022 16:13:59 GMT+0530 (IST)

Beautiful Anasuya Latest Saree Pic Sharing In Instagram

జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ సినిమాలతో పాటు బుల్లి తెరపై సందడే సందడి అన్నట్లుగా జోరు మీదుంది.ఇదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా అందాల విందు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదు. అందాల విందు విషయంలో హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గను అన్నట్లుగా ఈమె ఫోటోలు ఉంటాయి.

హీరోయిన్ గా కూడా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ సమయంలో చీర కట్టు లో ఈ ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.

ఎక్కువ శాతం మోడ్రన్ డ్రెస్ ల్లో సాధ్యం అయినంత ఎక్కువ స్కిన్ షో కు ఆసక్తి చూపించే అనసూయ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో చీర కట్టు ఫోటోలు షేర్ చేయడం ద్వారా చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు.

తాజాగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయిన అనసూయ ఇక నుండి రెగ్యులర్ గా స్టార్ మా షో ల్లో కనిపించబోతుంది. భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో పాటు.. అనసూయ సినిమా ఆఫర్లకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటామని స్టార్ మా వారు హామీ ఇవ్వడంతో అక్కడకు వెళ్లింది అనే ప్రచారం జరుగుతోంది.

జబర్దస్త్ తో స్టార్ డమ్ ను దక్కించుకున్న అనసూయ ఇప్పుడు ఆ జబర్దస్త్ ను మరో ఛానల్ కోసం వదులుకోవడం ఆమె యొక్క స్వార్థం కు నిదర్శనం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. వాటన్నింటిని పెద్దగా పట్టించుకోని అనసూయ మళ్లీ తాను బుల్లి తెరపై బిజీ అయ్యి స్టార్ మా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.