Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: డబ్బూ కోసం ప్రియాంక చెల్లి!

By:  Tupaki Desk   |   20 Feb 2020 4:30 PM GMT
ఫోటో స్టోరీ: డబ్బూ కోసం ప్రియాంక చెల్లి!
X
హిందీ సినిమాలు చూసేవారికి పరిణీతి చోప్రా పేరు పరిచయం చెయ్యాల్సిన పనే లేదు. ప్రియాంక చోప్రాకు కజిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతి 'ఇష్క్ జాదే'.. 'శుద్ద్ దేశి రొమాన్స్'.. 'హసీ తో ఫసీ'.. 'గోల్ మాల్ ఎగైన్'.. 'కేసరి' లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. పరిణీతి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రసగుల్లా లాగా కొంచెం బొద్దుగా ఉండేది. కానీ బాలీవుడ్ గాలి తగిలితే పూతరేకులా జీరో సైజ్ కు మారి కళాత్మక బుర్ర ఉండే జనాలకు నిద్రలేకుండా చేస్తోంది.

ఈ తరం భామ కాబట్టి హాట్ ఫోటోషూట్లు చెయ్యడం సోషల్ మీడియాలో మంటపెట్టడం అత్యంత సహజం. ఈ బ్యూటీకి ఇన్స్టాలో 25 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "డబ్బూ క్యాలెండరు కు షూట్ చేయడం అంటే నేను ఆరోజు నైట్ న్యూయార్క్ హాలిడేకి వెళ్తున్నట్టు. ఏడాదిలో లాస్ట్ షాట్. థ్యాంక్ యూ డబ్బూ..మనీషా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటో డబ్బూ రత్నాని క్యాలెండరు 2020 లోనిది. బ్లాక్ ప్యాంట్.. చేత్తో ఒక లెదర్ జాకెట్ ను పట్టుకుని నిలుచుంది. ఆ లెదర్ జాకెట్ ను దరించకుండా చేత్తో పట్టుకోవడంతో ఇన్నర్ వేర్ లో పరిణీతి హాట్ గా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో లో పరిణీతి కొంచెం సీరియస్ గా పోజిచ్చింది.

ఈ ఫోటోకు అనుష్క శర్మ లాంటి బాలీవుడ్ బ్యూటీలు ఓ లైక్ వేసుకున్నారు. ఈ ఫోటోకు కామెంట్లు కూడా అదిరిపోయాయి. "ప్రియాంక హాట్.. పరిణీతి డబల్ హాట్".. "క్యాలెండర్ ఆన్ ఫైర్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే పరిణీతి ప్రస్తుతం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'.. 'సైనా'.. 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' చిత్రాల్లో నటిస్తోంది.