ఫొటోటాక్ : తెలుగు బిబి బ్యూటీ షాకింగ్ ఎక్స్ పోజ్ షో

Tue Nov 23 2021 21:00:01 GMT+0530 (IST)

Phototalk Telugu BB Beauty Shocking Exposure Show

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నందిని రాయ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన చిన్నా చితకా ఆఫర్లను ఆమె సద్వినియోగం చేసుకుంటూ అందాల వింధుతో అందరిని ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు మరియు బుల్లి తెర పై గేమ్ షో లతో కూడా ఈమె ఆకట్టుకుంటూనే ఉంది. అందంతో పాటు మంచి ఫిజిక్ ఉండి స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన మెటీరియల్ అంటూ అభిమానులు ఈ అమ్మడికి కితాబిస్తూ ఉంటారు.సినిమాలు.. వెబ్ సిరీస్ ల్లో మాత్రమే కాకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత అంతకు మించి అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటో షూట్ లు బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ను క్రాస్ చేసేంతటి ఎక్స్ పోజింగ్ ను కలిగి ఉంటున్నాయి. ముద్దుగుమ్మ నందిని రాయ్ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లైట్ పింక్ డ్రస్ లో అదే కలర్ స్కిన్ టో తో ఈ అమ్మడి రూపం మరియు ఔట్ ఫిట్ ఎంత చూసినా చూడాలనిపించే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల ఆరబోత విషయంలో ఆ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గడం లేదు... ఈ అందంకు ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఈమె షూట్ ఎట్ ఆలేరు.. మెట్రో కథలు.. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ లను ఈమె చేసింది. ముఖ్యంగా ఈమె చేసిన ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ లో అందాల ఆరబోత పీక్స్ అనడంలో సందేహం లేదు. ముద్దుగా బొద్దుగా ఉన్న నందిని రాయ్ ఆ సినిమాలో పోసాని కృష్ణ మురళి భార్య పాత్రలో కనిపించింది. ఇక మెట్రో కథలు వెబ్ సిరీస్ లో ఒక షాకింగ్ పాత్రలో ఆమె కనిపించింది. సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.