ఫొటోటాక్‌ః సమంతకు పెళ్లి అయ్యిందా అంటున్నారు?

Sun Jan 24 2021 10:40:58 GMT+0530 (IST)

Phototalk: Are you married to Samantha?

బాలీవుడ్ హీరోయిన్స్ విషయం పక్కన పెడితే సౌత్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కాస్త లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేయడం లేదంటే పెళ్లికి ముందు ఉన్నంత హడావుడిగా ఉండక పోవడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోలతో పెళ్లి అయిన హీరోయిన్స్ విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది సినిమా కెరీర్ ను వదిలేసి గృహిణిగా లేదంటే వ్యాపారస్తులుగా సెటిల్ అయ్యారు. కాని సమంత విషయం మరోలా ఉంది. అక్కినేని నాగచైతన్యతో వివాహం అయిన సమంత ఏమాత్రం తగ్గడం లేదు. కొందరు సమంత తీరును విమర్శిస్తుంటే ఎక్కువ శాతం మంది మాత్రం ఆమెను ప్రశంసిస్తున్నారు.పెళ్లి తర్వాత హాట్ ఫొటో షూట్ ల విషయంలో సమంత వెనక్కు తగ్గడం లేదు. ఇటీవ ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రమోషన్ కోసం ముంబయి వెళ్లిన సమంత అక్కడ హాట్ ఫొటో షూట్ ఇచ్చింది. ఆ ఫొటోలు తెగ ట్రెండ్ అయ్యాయి. ఆ ఫొటోల గురించి ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ బ్యాక్ లెస్ ఔట్ ఫిట్ లో ఈ అమ్మడు కనిపించింది. దీంతో మళ్లీ నెటిజన్స్ సమంతకు పెళ్లి అయ్యిందనే విషయం అప్పుడప్పుడు మర్చి పోతున్నాం. ఇలాంటి ఫొటోలు చూస్తే సమంత పెళ్లి ఎందుకు చేసుకుందా అనే బాధ కూడా కలుగుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.