ఫొటోటాక్ : గీతాఆర్ట్స్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్

Mon Jan 27 2020 13:27:13 GMT+0530 (IST)

Phototalk: GeetaArts Republic Day Celebration

రిపబ్లిక్ డే సందర్బం గా ఒకొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు. జాతీయ జెండాను గౌరవించడం తో పాటు ఆ రోజున దేశ భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతాఆర్ట్స్ మాత్రం చాలా విభిన్నంగా.. వినూత్నంగా రిపబ్లిక్ డేను జరుపుకుంది. హైదరాబాద్ లోని గీతాఆర్ట్స్ ఆఫీస్ ను త్రివర్ణపు లైట్ల వెలుగులతో జిగేలుమనేలా చేశారు.గీతాఆర్ట్స్ అఫిషియల్ సోషల్ మీడియా పేజ్ లో ఈ ఫొటోను పోస్ట్ చేయడం జరిగింది. ఇదే ఫొటోను ట్వీట్ చేసిన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఇలా వినూత్నం గా రిపబ్లిక్ డే వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. ఆఫీస్ బిల్డింగ్ మొత్తం కూడా ఒక జాతియ జెండా మాదిరిగా మారిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైటింగ్ తో బిల్డింగ్ ను త్రివర్ణంలోకి మార్చడంతో పాటు ఆఫీస్ లో జెండా వందనం కూడా నిర్వహించారట.