Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అస్సలు ఆగని రత్తాలు

By:  Tupaki Desk   |   4 April 2020 11:10 AM GMT
ఫోటో స్టోరీ: అస్సలు ఆగని రత్తాలు
X
సౌత్ లో చాలామంది హాట్ భామలు ఉంటారు గానీ వారిలో బాలీవుడ్ బ్యూటీలకు గట్టిగా పోటీ ఇచ్చే భామలు మాత్రం తక్కువే. అలాంటి పోటీ ఇవ్వగలిగిన వారిలో రాయ్ లక్ష్మి ఒకరు. కన్నడ.. తమిళం.. తెలుగు సినిమాలను ఎప్పుడో కవర్ చేసిన ఈ భామ హిందీలో కూడా ఒక సినిమాలో నటించి తనకు సినిమా ఇండస్ట్రీ ల పట్ల సామాజిక న్యాయం 100% ఉందని.. అది ఎంతో హాట్ గా నిర్వహిస్తానని అంతఃకరణ శుద్ధితో నెటిజన్ల సాక్షిగా ప్రమాణం చేసినట్టుగా ఆ.. విధంగా ముందుకు సాగిపోతోంది.

ఈ తరంలోని ఇతర అందమైన సెలబ్రిటీల స్టైల్ లోనే సోషల్ మీడియాను విరివిగా వాడుతూ తన ఫాలోయర్ లకు అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కాబట్టి ఇంట్లోనే ఉంది. మామూలుగా అయితే ఏదో ఒక బీచ్ లొకేషన్లో అందమైన బికినీలు ధరించి కత్తిలాంటి ఫోటోలను ఆప్ లోడ్ చేస్తూ సరదాగా సమయాన్ని గడిపేది. ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు. బీచ్ లు లేవు.. విదేశీ ప్రయాణాలు లేవు. అందరికీ ఇల్లే దిక్కు.. అందుకే ఈ భామ కూడా ఇంట్లో ఏం చేయాలో అది చేస్తోంది. దాంతో పాటుగా తన కు అలవాటయిన కసరత్తులు చేస్తూ.. ఆ ఫోటోలనే తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తోంది.

ఈ ఫోటోలలో నలుపు రంగు స్పోర్ట్స్ వేర్ ధరించి తలకు హెడ్ బ్యాండ్ కట్టుకుని అన్నిరకాల ఎక్సర్ సైజులను ఎడాపెడా చేస్తూ తన ఫిట్నెస్ కు లాక్ డౌన్ లు.. కరోనాలు.. కాకరకాయలు ఎలాంటివి కూడా అడ్డురావని నిరూపిస్తోంది. ఈ లాక్ డౌన్ కనుక మరింతగా కొనసాగిస్తే.. సోషల్ మీడియాలోనే కసరత్తుల క్లాసులు నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతి గంటకూ కరోనా కౌంట్ తీసుకుంటూ.. కరోనా యాప్ లు డౌన్లోడ్ చేసుకుని.. వాటితో కాలం గడిపే దానికంటే ఈ కసరత్తు వ్యవహారమే మేలని చెప్పక తప్పదు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అనే మూవీలోనూ నటిస్తోంది.