పిక్ టాక్ : హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందం

Fri Sep 24 2021 08:00:01 GMT+0530 (IST)

Photos of Sarah Tendulkar doing workouts

క్రికెట్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన్ను క్రికెట్ దేవుడు అంటూ అభిమానులు కొలిచేవారు. ఇప్పటికి కూడా ఆయన్ను ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు. ఆయన పిల్లలు అర్జున్ మరియు సారా ఇద్దరు కూడా సోషల్ మీడియాలో మంచి సెలబ్రెటీలు. అర్జున్ ఇప్పటికే క్రికెటర్ గా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో వైపు సారా కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా సారా అందంగా మంచి ఫిజిక్ తో ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేసిన సారా టెండూల్కర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వయంగా సారానే ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్రౌన్ జిమ్ డ్రస్ లో సారా వావ్ అనేట్లుగా ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి. సారా స్కిన్ టోన్ కూడా చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆమె అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న కారణంగా హీరోయిన్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా స్టార్ అవుతుందని నమ్ముతున్నారు. కనుక ఆమె హీరోయిన్ గా ప్రయత్నిస్తుందేమో చూడాలి.

సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుండి దూరం అయినా కూడా ఆయన ఏదో ఒక రకంగా మీడియాలో ఉంటూనే ఉన్నారు. తన పిల్లలకు పూర్తి స్వేచ్చను ఇచ్చిన సచిన్ వారి ఇష్టానుసారంగా నిర్ణయాలను తీసుకునేందుకు మద్దతుగా నిలుస్తాను అంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతం సారా ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉన్నా కూడా ఆ విషయాన్ని సచిన్ సమర్థిస్తాడనే గుసగుసలు వినిపిస్తాయి. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం చాలా కాలంగా సాగుతోంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.