ఫొటోటాక్ : క్యూట్ సవతి సోదరులతో హీరోయిన్

Thu Jul 22 2021 12:25:17 GMT+0530 (IST)

PhotoTalk: Heroine with cute step brothers

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు మొత్తం నలుగురు పిల్లలు. మొదటి భార్యకు సారా అలీ ఖాన్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్ లు కాగా రెండవ భార్య కరీనా కపూర్ ఖాన్ తో ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు తైమూర్ అలీ ఖాన్ మరియు జాహ్. ఇక ఆయన కూతురు సారా అలీ ఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా మంచి పేరును దక్కించుకుంది. హీరోయిన్ గా దూసుకు పోతున్న సారా అలీ ఖాన్ రెగ్యులర్ గా తన సవితి తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో గడుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది.తాజాగా బక్రీద్ సందర్బంగా సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో తండ్రి సైఫ్ తో పాటు సోదరుడు ఇబ్రహీం మరియు సవితి సోదరులు అయిన తైమూర్ మరియు జాహ్ లు కూడా ఉన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సహజంగా ఇలా సవితి తల్లి లేదా సవితి సోదరులు సోదరితో గడిపేందుకు ఆసక్తి చూపించరు. కాని సారా అలీ ఖాన్ మాత్రం తండ్రి పిల్లలు తన సొంత సోదరులుగా చూసుకుంటూ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్ గా సొంతంగా ఇమేజ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సారా అలీ ఖాన్ ఈ ఫొటో ను షేర్ చేయడం వల్ల ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా గుర్తింపు దక్కించుకుంది. మొత్తానికి సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ లతో మాత్రమే కాకుండా ఇలా తమ్ముళ్ల ఫొటోలను షేర్ చేయడం వల్ల కూడా వైరల్ అయ్యింది. ఈ విషయంలో ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే అని.. ఈ ఫొటో చాలా స్పెషల్ అన్నట్లుగా నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.