Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : హాట్‌ బ్యూటీ ఆసనాలతో కవ్విస్తోంది

By:  Tupaki Desk   |   27 May 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : హాట్‌ బ్యూటీ ఆసనాలతో కవ్విస్తోంది
X
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఆమె ఫోటోలు షేర్‌ చేయడం మాత్రమే కాకుండా ఆమె యొక్క పబ్లిక్‌లోని ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే కెరీర్‌ ను బిల్డ్‌ చేసుకుంటున్న జూనియర్‌ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ వర్కౌట్స్ తో యోగ ఆసనాలతో కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది.

షూటింగ్‌ లతో పార్టీలతో ఎంత బిజీగా ఉన్నా కూడా జిమ్‌ లో వర్కౌట్స్ చేయడం.. కొద్ది సమయం యోగాసనాలు వేయడం జాన్వీ కపూర్ యొక్క దిన చర్య లో భాగం. ఆమె యోగాసనాలు వేస్తున్న ఫోటోలు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ జాన్వీ కపూర్‌ అలా యోగా ఆసనాలు వేస్తే ఎవరైనా అలా చూస్తూ ఉండాల్సిందే అనడంలో సందేహం లేదు.

యోగా అంటే పెద్దగా ఆసక్తి లేని వారు కూడా ఈ ఆసనం ఏదో బాగుందే అని ఒక నిమిషం జాన్వీ కపూర్‌ ఆసనంను ఆమె అందంను చూస్తూ ఉండి పోతారు. అంతటి అందమైన జాన్వీ కపూర్‌ ఈ ఆసనంతో కుర్రాళ్లను కవ్విస్తోంది.

గుండెల్లో గుబులు పుట్టించే విధంగా హాట్‌ బ్యూటీ యోగా ఆసనం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్ యోగా ఆసనాలు అందం ఆకట్టుకుంటున్నాయి.

కెరీర్‌ ఆరంభంలో సన్నగా నాజూకుగా ఉన్న జాన్వీ కపూర్ ఇప్పుడు కాస్త బరువు పెరిగింది. ఇప్పుడు కూడా అంతకు మించి అందంగా జాన్వీ కపూర్‌ ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తల్లి శ్రీదేవి వారసత్వం ను నిలుపుకునే విధంగా అందంతో పాటు అభినయం తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితం అయిన ఈ అమ్మడు త్వరలోనే కోలీవుడ్‌ లేదా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ కు చెందిన స్టార్‌ ముద్దుగుమ్మలు తెలుగు లో నటించారు.. ప్రస్తుతం కూడా నటిస్తున్నారు. కనుక జాన్వీ కపూర్‌ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరో ఒక తెలుగు స్టార్‌ హీరో కు జోడీగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.