ఫోటోటాక్ : థైస్ తో రెచ్చగొడుతున్న నాని బ్యూటీ

Tue May 24 2022 06:00:01 GMT+0530 (IST)

Photo Talk of a Priyanka Mohan

తెలుగు ప్రేక్షకులకు నాని గ్యాంగ్ లీడర్ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్. ఈ అమ్మడు వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటూ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరును దక్కించుకుంది. తెలుగు లో నాని గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈ అమ్మడు సినిమాలు చేయలేదు. ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది.ఇప్పుడు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఇతర భాషల్లో కూడా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రియాంక మోహన్ అనగానే ఒక పద్దతైన అమ్మాయి అన్నట్లుగా ఒక మంచి అభిప్రాయం ఉంది. స్కిన్ షో కు అస్సలు ఈ అమ్మడు ఆసక్తి చూపించదు అనే అభిప్రాయం అందరిలో ఉంది. కాని ఆ అభిప్రాయం ను చెరిపేసే ప్రయత్నాలు చేస్తోంది.

మెల్ల మెల్లగా స్కిన్ షో కు తాను ఏమీ వ్యతిరేకం కాదు అన్నట్లుగా చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే ముందు ముందు ఈ అమ్మడి నుండి మంచి మాస్ మసాలా పిక్స్ ను చూడబోతున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో చూసిన దాని కంటే రెట్టింపు అందంగా ఉన్నారంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తాజాగా ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోల్లో థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ అందరిని కూడా ఆకర్షిస్తుంది. కుర్రకారును రెచ్చగొట్టే విధంగా ఈ అమ్మడి అందం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి అందాల ఆరబోత చేస్తే ఖచ్చితంగా మీ అందంకు సౌత్ లోనే టాప్ స్టార్ హీరోయిన్ అవుతారు అంటూ అభిమానులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హీరోయిన్ గా ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. తెలుగు లో కూడా ఒక సినిమాకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెళ్లడి అవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం స్కిన్ షో తో కొత్త ఆఫర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ గా ఈ అమ్మడి జోరు ముందు ముందు చూపించే అవకాశం ఉంది.