Begin typing your search above and press return to search.

గ్లామర్ తో మాయ చేస్తున్న మెహ్రీన్

By:  Tupaki Desk   |   23 May 2022 2:57 AM GMT
గ్లామర్ తో మాయ చేస్తున్న మెహ్రీన్
X
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న వారిలో మెహ్రీన్ ఫిర్జాదా ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇటీవల కాలంలో పెద్దగా సక్సెస్ అయితే కావడం లేదు. కానీ అవకాశాలు మాత్రం గ్యాప్ లేకుండా వస్తున్నాయి. ఇక గ్లామర్ విషయంలో అయితే ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. మొదట నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మోడల్ గా అప్పటికే మంచి గుర్తింపును అందుకున్న మెహ్రీన్ మొదటి సినిమా సక్సెస్ కాకముందే మంచి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా కొన్నాళ్ళపాటు బాగానే కొనసాగింది.

ఇక గ్లామర్ బ్యూటీల నుంచి పోటీ ఎక్కువ కావడంతో చాలా వరకు బరువు తగ్గింది. ప్రస్తుతం సరికొత్త గ్లామర్ ను బయటపెట్టిన ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం F3 సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న మెహ్రీన్ ఫిర్జాదా ఎక్కడ కనిపించినా కూడా హైలెట్ అయ్యే ప్రయత్నమే చేస్తోంది.

రీసెంట్గా బ్లాక్ లేహంగాలో అమ్మడు క్లీవేజ్ అందాలతో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది.

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ గ్లామర్తో మాత్రం ఎప్పటికప్పుడు తనను కొత్తగా పరిచయం చేసుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో అంతా బాగానే ఉంది కానీ ఇంకా కెరీర్ పరంగా అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం కేవలం F3 సినిమా మాత్రమే విడుదలకు సిద్ధంగా ఉంది. చేతిలో పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. ఇంతకుముందు వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టాయి. కాబట్టి F3 సినిమాతో ఎలాగైనా ఈ బ్యూటీ సక్సెస్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరికొన్ని కథలపై చర్చలు జరుపుతున్న ఈ బ్యూటీ తమిళంలో కూడా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.