అరనిమిషం రెప్ప వేయరు! అంతగా కిల్ చేసిన కియరా!

Sat May 28 2022 09:00:01 GMT+0530 (IST)

Photo Talk of a Kiara

నిమిషం పాటు అదిరిపడేలా.. అర నిమిషం మైండ్ బ్లాక్ అయ్యేలా ఏదో మాయ చేసింది కియరా. అంతగా ఆకట్టుకునే స్పెషల్ ఔట్ ఫిట్ తో మతులు చెదరగొట్టింది. కియరా నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో ఈ డిజైనర్ లుక్ ఆకర్షిస్తోంది.తాజా లుక్ లో కియరా అందచందాలు కిక్కిస్తున్నాయని చెప్పాలి. అలా ఇన్నర్ అందాలను ఎలివేట్ చేసే స్పెషల్ టాప్ ని ధరించి కాంబినేషన్ గా ఫ్లోరిష్ అందాలతో బాటమ్ వేర్ ని ధరించింది. కిల్లర్ ఫోజులతో కియరా కాకలు పుట్టించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

ఓవైపు 'జగ్ జగ్ జీయో' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న కియరా అద్వాణీ ఇంతకుముందే కేన్స్ 2022 వేడుకల్లో ఒక రేంజులో సందడి చేసింది. ఇప్పుడు ఇంతలోనే తన మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది.

కెరీర్ పరంగా చూస్తే హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సౌత్ లో తెలివైన ఎంపికలతో దూసుకెళుతోంది. కియారా తదుపరి రామ్ చరణ్ RC15 లో కనిపించనుంది.

శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియరా నటిస్తోంది. కియరాకు మొదటి పాన్ ఇండియా చిత్రమిది. సోషల్ మీడియాలో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ క్వీన్ గానూ కియరాకు పాపులారిటీ ఉంది.