ఫోటోటాక్ : నువ్వు మరీ అలా చూడకు రాధిక తట్టుకోలేం

Fri May 20 2022 21:00:01 GMT+0530 (IST)

Photo Talk of Neha Shetty

మెహబూబా.. గల్లీ రౌడీ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. దాంతో ఈ అమ్మడి కెరీర్ అంతటితోనే ఆగిపోతుందా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా డీజే టిల్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సిద్దు తన మ్యానరిజంతో ఆకట్టుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా అలరించే విధంగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన నేహా శెట్టితో ఆయన కాంబో సన్నివేశాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించిన నేహా శెట్టి మంచి గుర్తింపు దక్కించుకుని బిజీ అయ్యింది.

డీజే టిల్లు సినిమాలో ఎక్కువ శాతం చీర కట్టులో కనిపించినా కూడా అందాల విందు విషయంలో తగ్గలేదు. ఎంత వరకు చూపించాలో అంత వరకు అందంను చూపించడంతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంది. మొత్తానికి డీజే టిల్లు సినిమా వల్ల ఆమె కెరీర్ పూర్తిగా మారింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒక వైపు వరుస సినిమాల్లో ఆఫర్లు వస్తుండగా మరో వైపు ఈ అమ్మడి సోషల్ మీడియా పోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి ఫోటోలు ఉంటాయి.

మరీ వల్గర్ గా కాకుండా క్యూట్ గా హాట్ గా అమ్మాయిలు సైతం అసూయ పడే స్కిన్ టోన్ తో ఈ అమ్మడి ఫోటోలు ఉంటాయి. తాజాగా ఈఫోటోను షేర్ చేసి ఆకట్టుకుంది.

ఈ ఫోటోలో నేహా శెట్టి చూపులకు ప్రతి ఒక్కరు పడిపోయేలా ఉన్నారు. మరీ ఇంతగా కొరికే విధంగా రొమాంటిక్ గా చూడకు రాధిక.. మేము తట్టుకోలేం మావి చిన్న గుండెలు అంటూ నేహా శెట్టి ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లు లో రాధిక పాత్ర తో బాగా పాపులారిటీని దక్కించుకోవడం వల్ల ఇప్పటికి కూడా ఆమెను చాలా మంది రాధిక అంటున్నారు.