ఫోటో టాక్: తెలుగమ్మాయి ఇంత సెక్సీగానా

Wed Dec 04 2019 20:46:30 GMT+0530 (IST)

Photo Talk: Looks so Beautiful

'రంగస్థలం' ఫేం పూజిత పొన్నాడ గురించి పరిచయం అవసరం లేదు. ఆది పినిశెట్టికి లవర్ గా నటించింది ఆ చిత్రంలో. అటుపైనా పలు చిన్నా చితకా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉంది ఈ తెలుగమ్మాయి.అందానికి అందం .. వేడెక్కించే వొగరు ఉన్న ఈ హాట్ బ్యూటీ నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానులకు టచ్ లో ఉంటోంది. అక్కడ రెగ్యులర్ గా ఫోటోషూట్లను షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది. ఇప్పటికే పూజిత సోషల్ మీడియాలో భారీగా అభిమానుల్ని  సంపాదించుకుంది. ఈ రైజ్ ని మరింత పెంచే దిశగా గ్యాప్ లెస్ గా నిరంతరం వేడెక్కించే ఫోటోలతో విరుచుకుపడుతోంది.

మొన్నటికి మొన్న ఇన్ స్టాలో అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించిన పూజిత మరోసారి వేడెక్కించే ఫోటోని రివీల్ చేసింది. ఈసారి పసుపు వర్ణం ఫ్రాకులో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఆ ఓపెన్ టాప్ షోల్డర్.. విరజాజి కురులతో స్ట్రిప్డ్ లుక్ మైమరిపిస్తోంది. ఆ భుజానికి దిగువగా వీపుపై అదిరిపోయే పచ్చబొట్టు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫోజులో మానస సరోవరం నుంచి దిగొచ్చిన రాణీ హంసలా కనిపిస్తోంది. పసుపు ఫ్రాకులో పసుపు వర్ణం దేహశిరులు అంతే గమ్మత్తుగా మత్తెక్కిస్తున్నాయి. తెలుగమ్మాయ్ ఇదే స్పీడుతో ఉంటే ఇక ఇరుగు పొరుగు భాషల్లోనూ అవకాశాల ద్వారాలు తెరుచుకున్నట్టే.