Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: బ‌్లాక్ చీటా మెరుపులు

By:  Tupaki Desk   |   4 Dec 2019 3:33 PM GMT
ఫోటో టాక్: బ‌్లాక్ చీటా మెరుపులు
X
న‌ల్ల‌ని చుక్క‌ల చిరుత అడ‌విలోంచి త‌ప్పిపోయి జ‌నార‌ణ్యంలోకి దూసుకొచ్చిందా? అది కూడా ఫిలింఫేర్ ఈవెంట్లో ప్ర‌వేశించిందా? అన్న‌ట్టుగా ఉంది ఈ లుక్. బ్లాక్ పాంథ‌ర్ సినిమాలో క్యారెక్ట‌రైజేష‌న్ ని త‌ల‌పిస్తూ మ‌లైకాను ఇలాంటి చీటా డ్రెస్ తో చూపించిన డిజైన‌ర్ క్రియేటివిటీని ప్ర‌శంసించాల్సిందే. ఆ చీటా డ్రెస్ లో గ‌మ్మ‌త్త‌యిన ఇంకో మ్యాట‌ర్ ఉంది. అదో బికినీ త‌ర‌హా డిజైన్. పైగా పాక్షికంగా ఇన్ సైడ్ అందాల్ని ఎలివేట్ చేస్తోంది.

అస‌లే ప‌ర్ఫెక్ట్ ఫిట్ రూపం. సోగ దేహం కావ‌డంతో ఆ డ్రెస్ అంతే హై లైట్ అయ్యింది. ముంబైలో జరిగిన ఫిలింఫేర్ గ్లామ‌ర్ ఈవెంట్లో అందాల మ‌లైకం ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. పోటీ భామ‌లంతా త‌న‌నే తలలు తిప్పి చూసేలా షో స్టాప‌ర్ గా నిలిచింది. అనుష్క శర్మ- అలియా భట్- కృతి సనోన్- అనన్య పాండే ఇంత‌మంది భామ‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. వరుణ్ ధావన్- ఆయుష్మాన్ ఖుర్రానా స‌హా చాలా మంది బి-టౌన్ నటీనటులు ఈ ఈవెంట్లో సంద‌డి చేశారు. అయితే మలైకా అరోరా మెరుపుల గౌనుపైనే అంద‌రి క‌ళ్లు. త‌న అద్భుత‌ ప్రదర్శనతో రూప‌లావ‌ణ్యంతో హృదయాలను గెలుచుకుంది.

ఈ కార్యక్రమంలో మలైకా అరోరా ఒక అటెలియర్ జుహ్రా గౌనులో క్యాట్ వాక్ చేసింది. రెడ్ కార్పెట్ పై మలైకా గ్లింప్స్ క్యాచ్ చేసేందుకు ఫ్యాన్స్ పోటీప‌డ్డారు. ఇటీవ‌లే 46 వ పుట్టినరోజు వేడుకల్లో బంగారు వ‌ర్ణం మిరుమిట్ల దుస్తులను ధ‌రించిన మ‌లైకా ఈసారి కూడా అంతే గ్రేట్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెలికాడు అర్జున్ కపూర్ ని ప్ర‌శ్నిస్తే.. మలైకా అరోరాతో తన పెళ్లి ఇప్ప‌ట్లో లేద‌ని తేల్చేశాడు. ప్రస్తుతం పానిపట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాన‌ని అర్జున్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.