Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: తార‌క‌రాముని ద‌స‌రా గిఫ్ట్

By:  Tupaki Desk   |   8 Oct 2019 12:55 PM GMT
ఫోటో టాక్: తార‌క‌రాముని ద‌స‌రా గిఫ్ట్
X
తార‌క రాముడితో అభ‌య్ రామ్ - భార్గ‌వ్ రామ్ .. కాంబినేషన్‌ బాగుంది క‌దూ? వార‌సులు చూస్తుండ‌గానే ఎదిగేస్తున్నారు. మాస్ట‌ర్ అభ‌య్ రామ్.. మాస్ట‌ర్ భార్గ‌వ్ రామ్ క్యూట్ కిడ్స్ ఇదిగో ఇలా డాడ్ తో క‌లిసి కోతి క‌మ్మ‌చ్చి ఆడుతున్నారు. ఈ ఫోటో అభిమానుల‌కు ద‌స‌రా ట్రీట్ అనే చెప్పాలి.

చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వేమో! అన్నంత ముచ్చ‌టగొలుపుతోంది ఈ ఫోటో. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఫ్యామిలీ మ్యాన్ గా తార‌క్ డీసెన్సీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. తారక్-ల‌క్ష్మి ప్ర‌ణతి జోడీ కిడ్స్ తో క‌లిసి లైఫ్ లో ప్ర‌తి మూవ్ మెంట్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కుటుంబ స‌మేతంగా విదేశీ ట్రిప్ ల‌కు వెళ్లిన‌ప్ప‌టి ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో అభిమానులు షేర్ చేసిన‌ప్పుడు అవి జోరుగా వైర‌ల్ అయ్యాయి.

ఇక తార‌క్ కెరీర్ ప‌రంగానూ బిజీ బిజీ. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కొమ‌రం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర‌కు సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ ని క్యాచ్ చేసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. 2020 జూలై 30న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నామ‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.