ఫోటో స్టోరి: టపు టపు టపోరి కన్యా కుమారి..!

Mon Mar 01 2021 21:00:01 GMT+0530 (IST)

Photo Story: Tapu Tapu Tapori Kanya Kumari ..!

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన కెరీర్ ని వేగంగా పరుగులెత్తించడంలో సఫలమవుతోంది. హార్డ్ వర్క్ లో జాన్వీ తన మామ్ నే తలపిస్తోందన్న ప్రశంసలు అందుకుంటోంది. శ్రీదేవి అంతటి విజువల్ బ్రిలియెన్సీ ని ఈ నాలుగైదు సినిమాల కిడ్ నుంచి ఆశించడం సరైనది కాదనేది అభిమానుల అభిమతం.అయితే శ్రీదేవి లెగసీని నడిపించేందుకు ఇప్పుడు తనకు ఇంటి నుంచే పోటీ ఎదురు కానుంది. తన సోదరి ఖుషీ కపూర్ త్వరలోనే తెరంగేట్రానికి సిద్ధమవుతున్న వేళ జాన్వీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. అదంతా అటుంచితే.. కేవలం ఇంటి నుంచి మాత్రమే కాదు.. వెలుపలి నుంచి జాన్వీకి విపరీతమైన పోటీ ఉంది. సాటి నటవారసురాళ్లు కూడా ఇప్పటికే క్రేజీ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.

అందుకే జాన్వీ హార్డ్ వర్క్ ని అస్సలు విడిచిపెట్టదు. ఈ భామ నిరంతరం జిమ్ యోగా ధ్యానం అంటూ లైఫ్ ని ఎంతో క్రమశిక్షణతో నడిపిస్తోంది. ఇక పబ్లిక్ అప్పియరెన్స్ పరంగానూ జాన్వీ ఎక్కడా తగ్గదు. బికినీ షూట్.. స్విమ్ సూట్.. పొట్టి నిక్కరు.. డ్రెస్ ఏదైనా జాన్వీ ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తుంది.

తాజాగా వైట్ అండ్ వైట్ స్పోర్ట్ లుక్ తో ముంబై వీధుల్లో వెళుతూ సర్ ప్రైజ్ చేసింది. చూస్తుంటే జాన్వీ వర్కవుట సెషన్స్ కి వెళుతున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం  ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. జాన్వీ నటించిన రూహీ అఫ్జా.. దోస్తానా 2 రిలీజ్ కి రావాల్సి ఉంది.