Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: హంబుల్ గా సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:31 AM GMT
ఫోటో స్టోరీ: హంబుల్ గా సూపర్ స్టార్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు పలు బ్రాండ్ల కు ప్రచార కర్తగా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. ఇతర బ్రాండ్ల తో పాటుగా తన సొంత బ్రాండ్ 'ది హంబుల్ కో దుస్తులకు మహేష్ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. క్రిస్మస్ సీజన్ త్వరలో రాబోతున్న సందర్భంగా ది హంబుల్ కో బ్రాండ్ వారు కొత్త డిజైన్ల ను విడుదల చేస్తున్నారు. ఈ విషయం మహేష్ సతీమణి నమ్రత వెల్లడించడం విశేషం.

నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "ది హంబుల్ కో కొత్త డిజైన్లు వచ్చాయి. హంబుల్ తో నా క్రిస్మస్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నమ్రత షేర్ చేసిన ఫోటోలో మహేష్ బాబు హంబుల్ బ్రాండ్ దుస్తులు ధరించి మరో ఇద్దరితో కలిసి పోజిచ్చారు. డార్క్ కలర్ చెక్స్ షర్ట్.. బ్లూ జీన్స్ ధరించి తనదైన స్టైల్ లో స్మైల్ ఇస్తూ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. క్రిస్మస్ సీజన్ లో హంబుల్ కో దుస్తుల ప్రచారం ఇంకా ఊపందుకుంటుందేమో చూడాలి.

సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీ గా రష్మిక మందన్న నటిస్తోంది. విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భం గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.