ఫోటో స్టోరీ : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ అందాలు..!

Tue Dec 06 2022 11:18:27 GMT+0530 (India Standard Time)

Photo Story : Milky Beauty Tamannah Stylish In Black N White Dress

రెండు దశాబ్దాల క్రితం తెరంగేట్రం చేసినా ఇప్పటికీ ప్రేక్షకులను తన అందంతో మెస్మరైజ్ చేస్తూ వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఏజ్ బార్ అవుతున్నా కొద్దీ ఇంకా ఇంకా అమ్మడి అందం పెరుగుతుందని చెప్పొచ్చు.దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన తమన్నా ప్రస్తుతం యువ హీరోలతో కూడా జోడీ కడుతుంది. తనకు వచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా అన్ని విధాలుగా వాడుకునే తమన్నా లేటెస్ట్ గా సత్యదేవ్ తో కలిసి గుర్తుందా శీతాకాలం మూవీలో నటించింది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమన్నా అటెండ్ అయ్యింది.

ఇక ఈ ఈవెంట్ లో సెలబ్రిటీస్ ఎంతమంది ఉన్నా అందరి కళ్లు మత్రం తమన్నా మీదే ఉన్నాయి. బ్లాక్ అబ్డ్ వైట్ కాస్టూమ్ తో తమన్నా తన గ్లామర్ తో మెప్పించింది. థై షోతో అమ్మడు పిచ్చెక్కించేసిందంటే నమ్మాల్సిందే.

2005 లో చాంద్ సె రోషన్ చెహ్రా మూవీతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన తమన్నా 2006లో శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 2007లో వచ్చిన హ్యాపీడేస్ లో అమ్మడు సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక అప్పటినుంచి తెలుగు తమిళ భాషల్లో తిరుగులేని విధంగా కెరీర్ కొనసాగించింది తమన్నా.

ఫోటో షూట్ తో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ని అలరిస్తున్న తమన్నా గుర్తుందా శీతాకాలం ఈవెంట్ లో వేసిన డ్రెస్ లో మాత్రం దేవకన్యలా మెరిసిపోతుంది. అక్కడకు వచ్చిన యువ హీరోలంతా కూడా తమన్నా ముందు తేలిపోయారని చెప్పొచ్చు. ముట్టుకుంటే మాసిపోయే అందంతో అమ్మడు నిజంగానే మిల్కీ బ్యూటీ అన్న పేరును నిలబెట్టుకుంటుంది. తమన్నా ఇప్పటికీ ఇంత అందంగా ఉండేందుకు ఆమె గ్లామర్ సీక్రెట్ ఏంటన్నది తెలుసుకోవాలని కుర్రాళ్లు ఆరాటపడుతున్నారు.

ఏది ఏమైనా తమన్నా ఇటు సినిమాలతో పాటు అటు గ్లామర్ సైడ్ కూడా రెచ్చిపోతుంది. సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది తమన్నా ఈమధ్యనే అక్కడ రెండు సినిమాలు చేసిన తమన్నా అక్కడ కూడా బిజీ అవ్వాలని చూస్తుంది.