ఫోటో స్టోరీ: మామూలు బ్యూటీ కాదు!

Fri Dec 06 2019 07:00:01 GMT+0530 (IST)

Photo Story: She Is Not A Normal Beauty

పంజాబీ భామ సోనమ్ బజ్వా తెలుసా? ఈ భామ ఎక్కువగా పంజాబీ సినిమాలలో నటించింది.. హిందీలో కూడా అడపాదడపా సినిమాలు చేసింది. తెలుగులో సుశాంత్ హీరోగా నటించిన  'ఆటాడుకుందాం రా' లో హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ 'బాబు బంగారం' సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.  ఈ తరం హాటు భామే కాబట్టి సోషల్ మీడియాను షేక్ చేయడంలో స్పెషలిస్టు.సోనమ్ ఇన్స్టా ఖాతాకు 4 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం సోనమ్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.  ఆ అనుచరుల కోసం ఈ భామ తరచుగా ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేస్తూ వారిని మురిపిస్తూ మైమరపిస్తూ ఉంటుంది.  తాజాగా ఈ భామ అదేపని చేసింది.  ఒక ఫోటో పోస్ట్ చేసి ఏవో అర్థం కాని ఎమోజీలతో ఒక క్యాప్షన్ ఇచ్చింది.  ఇప్పడు ఆ ఎమోజిలనను మనం అర్థం చేసుకుని పీకేదేమీ లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేసి ఫోటో గురించే మాట్లాడుకుందాం. థై స్లిట్ మోడల్.. పూల డిజైన్ ఉండే గ్రే కలర్ గౌన్ లో ఫ్లోర్ మీద వయ్యారంగా కూర్చుంది. ఒక కాలును ముందుకు చాపి.. రెండు చేతులను నేలపై పెట్టి తలను ఒకవైపుగా తిప్పి కళ్ళు మూసుకుని రమణీయమైన పెయింటింగ్ తరహాలో పోజిచ్చింది. నేపథ్యంలో ఉండే మొక్కలు ఈ ఫోటోకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

ఈ ఫోటోకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెట్టి కళాపోషణకు ఉదాహరణలుగా నిలిచారు. "ఫెయిరీ టేల్ లో ఏంజెల్ లా ఉన్నావు".. "పెయింటింగ్ లా  ఉందే".. "న్యాచురల్ బ్యూటీ" అంటూ మెచ్చుకున్నారు.  సోనమ్ బజ్వా సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'స్ట్రీట్ డ్యాన్సర్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు  తమిళంలో 'కాట్టేరి'.. పంజాబీలో 'అర్దాబ్ ముటియారన్' అనే సినిమాల్లో కూడా నటిస్తోంది.