ఫోటో స్టోరీ: గ్లామర్ కు గ్రామర్ నేర్పిస్తోంది

Fri Dec 06 2019 10:43:50 GMT+0530 (IST)

Photo Story: Puja Hedge In Airport

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉండే హీరోయిన్ ఎవరని అడిగితే పూజ హెగ్డే అనే చెప్పాలి.  టాప్ లీగ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తన కెరీర్లో పైకి దూసుకుపోతోంది పూజ.  బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకో కలిసిరావడం లేదు కానీ తెలుగులో మాత్రం అమ్మడి అదృష్టం పీక్స్ లో ఉంది.  గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ లాంటి భామ కావడంతో నెటిజన్లే కాదు ఫోటోగ్రాఫర్లు కూడా పూజ అంటే చాలు పడిచస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తే లటుక్కున పూజ అందాన్ని తమ కెమెరాలలో బంధిస్తారు.ఈమధ్య పూజ విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఫోటోగ్రాఫర్లు తమలోని రవివర్మలను రామ్ గోపాల్ వర్మలను బయటకు తీసి కెమెరాలకు  పని చెప్పారు.  బ్లూ కలర్ జీన్స్.. నెట్టెడ్ టాప్ ధరించిన పూజ చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని క్యాజువల్ డ్రెస్ లో ఉన్న ఓ అందాల రాణిలా నడుచుకుంటూ వచ్చింది.  అసలు ఈ డ్రెస్ లో హైలైట్ ఏంటి అని అడగడం కె.రాఘవేంద్రరావు బీఎయిజం ను తీవ్రంగా అవమానించడమే. అంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే ఎవరి తలైనా వెయ్యి ముక్కలైనట్టే!

అయినా ఒక డ్రెస్ ఎలా వేసుకోవాలి.. ఆ డ్రెస్ లో ఎలా నడవాలి.. దానికి తగ్గట్టు ఎలా నవ్వాలి ఇవన్నీ పూజకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. అందుకే హిట్లతో ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.  పూజ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్ 'జాన్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.