జిమ్ నుంచి వస్తూ బుట్టబొమ్మ ఇలా

Sat Feb 22 2020 12:40:13 GMT+0530 (IST)

Photo Story: Pooja Hegde coming from the gym

అల వైకుంఠపురములో సక్సెస్ ని ఓ రేంజులో ఎంజాయ్ చేస్తోంది పూజా హెగ్డే. సంక్రాంతి బరిలో క్లీన్ విన్నింగ్ టీమ్ తో పని చేసిన ఆనందం పూజాలో కనిపిస్తోంది. ఈ సినిమా తనకు కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. ఇన్నాళ్లు కేవలం గ్లామర్ బొమ్మగా మాత్రమే చూసిన జనం ఇప్పుడు బుట్టబొమ్మ అని పిలిచేస్తూ బోలెడంత ప్రేమించేస్తున్నారు. త్రివిక్రమ్ వల్ల తనకు దక్కిన కొత్త ఇమేజ్ ఇది.ఇక కెరీర్ పరంగా మరో లెవల్ ని చూపించేందుకు పూజా రెడీ అవుతోంది. 2020 ఈ అమ్మడికి మరింతగా కలిసి రానుంది. తదుపరి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీలోనూ నటించనుందన్న ప్రచారం నడుమ ఈ అమ్మడి ఆనందానికి అవధులే లేవని చెప్పాలి. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోనూ పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. దీంతో పాటు ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ `జాన్` (ప్రభాస్ 30)లోనూ ఈ భామ హీరోయిన్. అటు బాలీవుడ్ లోనూ కథలు వింటోంది.

అయితే ఇంత బిజీలోనూ ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో బుట్టబొమ్మ ఏమాత్రం అశ్రద్ధ చేయదనడానికి ఇదిగో ఈ ఫోటోనే ప్రూఫ్. నేటితరం నాయికల్లో పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో పూజా హెగ్డే అందం ఆల్ టైమ్ హాట్ టాపిక్. నవతరానికి ఈ బ్యూటీ ఒక స్ఫూర్తి.  ముంబైలో ఓ ఫిట్ నెస్ జిమ్ నుంచి వస్తూ పూజా ఇలా ప్రత్యక్షమైంది. బ్లాక్ టైట్ ఫిట్ ట్రాక్.. ఆ పైన బ్లూ స్కిన్ టైట్ టాప్.. దానిపై ఎల్లో కోట్ .. చేతికి హ్యాండ్ బ్యాగ్.. చూస్తుంటే జిమ్ లో వర్కవుట్లు ముగించి వస్తోందని అర్థమవుతోంది. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయిన బుట్టబొమ్మ సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది.