ఫోటో స్టోరి: పార్టీ గాళ్స్ చిలౌట్ వ్వావ్

Wed Oct 23 2019 10:01:30 GMT+0530 (IST)

Photo Story: Party Girls Chillout Wow

జీవితం ఉన్నది ఎందుకురా సోదరా?.. సదువులయ్యెదాక సదువుల లొల్లి... సదువులైనంక ఉద్యోగం లొల్లి. ఏందో జీవితం... ఎప్పుడు ఏదో ఎంటపడి తరుముతున్నట్టే ఉంటది... ఎందుకురా ఈరిగా.. వాడేమన్న సదివి దేశాలు ఏలేది ఉన్నదారా..... నిమిష నిమిషం టెన్షన్ కదరా?.. ఏందో ఈ మాయదారి లోకం గోల గజిబిజి గందరగోళం...



అందుకే జీవితంలో ప్రతి ఔన్సు ఎంజాయ్ చేయాలి. ప్రతి క్షణం.. ప్రతి నిమిషం మనది చేసుకునేందుకు ఇదిగో ఇలా చేయాలి. బాలీవుడ్ ఫేజ్ 3 గాళ్స్ చిలౌట్ పార్టీల గురించి తెలుసుకోవడం అంటే అదో పెద్ద సబ్జెక్ట్. ముందు తెలుసుకునే వాళ్ల యాటిట్యూడ్ మారాలి. పార్టీల్లో ఫుల్లుగా చిందేసే క్రౌడ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇదిగో అలా గుర్తింపు తెచ్చుకున్న బ్యాచ్ ని ఇక్కడ చూశారుగా..

చిత్తుగా మత్తుగా చిందేస్తే అర్హత సాధించినట్టా? అంటే అబ్బెబ్బే.. ఇదిగో ఇలా భూగోళం కదిలిపోయేలా అదిరిపోయే ఫోజివ్వాలి. యూత్ కి కిక్కెక్కిపోవాలి. ఆ కిక్కులో మత్తుగా జోగిపోవాలి. ఇంతకీ ఇక్కడ ఫోజులిచ్చిన ఈ భామలు అందరూ ఆల్మోస్ట్ బోయ్ ఫ్రెండ్స్ తో సహజీవనం సాగిస్తున్న వయ్యారులే. అర్జున్ కపూర్ గాళ్ ఫ్రెండ్ మలైకా అరోరాఖాన్.. ఆమె సోదరి అమృత అరోరాఖాన్.. అర్జున్ రాంపాల్ గాళ్ ఫ్రెండ్ గాబ్రియెలా దిమిత్రియదేశ్ .. వీళ్లంతా ముంబై ఊగిపోయేంత ఫుల్ పార్టీ క్రౌడ్ కి ప్రతినిధులు. ఆ సంగతి ఈ ఒక్క క్లిక్కులో కనిపిస్తోంది కదూ..!