Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఇస్మార్ట్ భామ లాక్ డౌన్ అందాలు

By:  Tupaki Desk   |   9 April 2020 10:10 AM GMT
ఫోటో స్టోరీ: ఇస్మార్ట్ భామ లాక్ డౌన్ అందాలు
X
నిధి అగర్వాల్ కు మొదటినుంచి టాలీవుడ్ లో మంచి ఆఫర్లే వచ్చాయి. అక్కినేని అన్నదమ్ములు.. నాగ చైతన్య.. అఖిల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఈ జనరేషన్ గ్లామర్ మాంత్రికుడు పూరి జగన్నాథ్ కంటపడింది. దీంతో 'ఇస్మార్ట్ శంకర్' లో అవకాశం లభించింది. ఆ సినిమా హిట్ కావడంతో నిధికి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో పాటు ఆఫర్లు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే మిగతా సోషల్ మీడియా జనరేషన్ భామల తరహాలోనే నిధి కూడా సామాజిక మాధ్యమాలను.. అంతర్జాలాన్ని.. హాట్ ఫోటోలతో కకావికలు చేయడం శ్రద్ధగా ప్రాక్టీస్ చేసేసింది.

ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ కదా. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉన్న కొందరు మారాజులు తప్ప మిగతావారు విశ్రాంత ఉద్యోగుల తరహాలో ఇంట్లో ఉంటున్నారు. పెద్ద స్టార్లే తమ ఇంట్లో ఉంటే నిధి అగర్వాల్ మాత్రం ఏం చేస్తుంది? అందుకే గ్లామర్ ఉద్యమానికి లాక్ డౌన్ లో ఏ మాత్రం ఆటంకం కలగకుండా తన వంతు బాధ్యతగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి అంతర్జాల హాటు కార్యకర్తగా పేరు తెచ్చుకుంటోంది. ఈరోజు తన ఇన్ స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు "మార్నింగ్ మార్నింగ్. # క్వారంటైన్# స్టే హోం స్టే సేఫ్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.

ఫోటో విషయానికి వస్తే క్రీమ్ కలర్ బాత్ రోబ్ ధరించి ఎంతో వయ్యారంగా అందాలను వడ్డిస్తూ ఒక హాట్ పోజు ఇచ్చింది. నిధి మొదటి నుంచి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు లాక్ డౌన్లో కూడా కే కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఈ ఫోటోలకు నెటిజన్లు లైక్స్ తో తమ జేజేలు తెలిపారు. ఇక నిధి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళం లో 'భూమి' అనే సినిమాలోనూ హిందీలో 'జేమ్స్' అనే సినిమాలో కూడా నటిస్తోంది.