Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పాపలో ఫైర్ ఉంది..!

By:  Tupaki Desk   |   10 Dec 2019 7:01 AM GMT
ఫోటో స్టోరీ: పాపలో ఫైర్ ఉంది..!
X
అదితి ఆర్య తెలుసు కదా? పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'ఇజం' సినిమాలో హీరోయిన్. 'సెవెన్' అనే మరో సినిమాలో కూడా నటించింది. ఈ భామ స్వతహాగా మోడల్. అదితి 2015 లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది. మిస్ వరల్డ్ 2015 పోటీలలో ఇండియా తరఫున పాల్గొన్న సుందరి. 2020 కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కూడా మెరిసింది. ఈ హాటు క్యాలెండర్ త్వరలోనే లాంచ్ కానుంది.

ఈతరం ఘాటు భామల తరహాలో అదితి కూడా సామజికమాధ్యమాల తిత్తి తీయడం.. అంతర్జాలికుల అంతుచూడడం అనేవి చాలా సాధారణంగా చేస్తుంది. ఆ హాటు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాజాగా ఈ భామ కింగ్ ఫిషర్ క్యాలెండర్ నుంచి ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోకు "వణికించే చలిలో స్విమ్ వేర్ ధరించి అతుల్ కాస్బేకర్ అధ్వర్యంలో ఫోటో షూట్ చేశాను. 18 వ ఎడిషన్ కింగ్ ఫిషర్ క్యాలెండరునుంచి ఇది నా ఫేవరెట్ ఫోటో. సౌత్ ఆఫ్రికాలోని క్యాంప్స్ బే బీచ్ లో దారుణమైన చలి. స్విమ్ సూట్ తప్ప ఏదైనా వేసుకోవాలి. కానీ ఫ్లాష్ హెడ్స్(లైట్స్) వల్ల చలి సమస్య కొంత తగ్గింది. ఫోటోల మ్యాజిక్ ఆవిష్కృతమైంది. మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలో అందమైన సముద్రతీరంలో శ్వేతవర్ణపు బికినీ ధరించి అందాలు ఒడుపుగా వడ్డిస్తూ ఒక ఆధునిక సమాజపు అందాల అప్సరసలాగా కూర్చుంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ అంటే ఎందుకు చాలామంది జనాలు పడిచస్తారో ఈ ఫోటో చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "నీలో ఫైర్ ఉంది".. "బాలీవుడ్ హీరోయిన్ లక్షణాలు పుష్కలం".. "ఇదంతా విజయ్ మాల్యా పుణ్యమే!" అంటూ స్పందించారు. ఇక అదితి ఆర్య సినిమాల విషయానికి వస్తే 'నిన్ను వదిలి నేను పోలేనులే' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. టైటిల్ భలే ఉంది కదా. ఇలాంటి పాపను వదిలి ఎవరైనా ఎక్కడికి పోతారు?