ఫోటో స్టోరీ: కనీవినీ ఎరుగని గ్లామర్ జ్వాల

Fri Mar 27 2020 12:40:28 GMT+0530 (IST)

Photo Story: Gutta Jwala Hot Stunning Photo

మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా పేరు తెలియనివారు చాలా తక్కువమందే ఉంటారు.  భారత దేశం తరఫున బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అంతర్జాతీయ వేదికలపై జ్వాల ఎన్నో పతకాలను సాధించింది.  క్రీడారంగంలో మనదేశ పౌరులకు ప్రదానం చేసే రెండవ అత్యున్నత పురస్కారం అర్జున అవార్డును కూడా జ్వాల సాధించింది.  స్పోర్ట్స్ విషయం ఇలా ఉంటే వ్యక్తిగత జీవితంలో జ్వాల ఈ తరం ఆధునిక మహిళ అని చెప్పాలి.  తన డోంట్ కేర్ యాటిట్యూడ్ తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.  ఏదైనా విషయంలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టడం కానీ.. తన వస్త్రధారణ విషయంలో కానీ ఎవరి మాట వినదు.సోషల్ మీడియాలో జ్వాలా సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఏ అప్డేట్ ఉన్న నిముషాల్లో అభిమానులతో పంచుకుంటుంది. ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఉండే బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో హాట్ ఫోటోలను పోస్ట్ చెయ్యడం.. ఎవరైనా నెటిజన్లు పిచ్చకామెంట్లు కనుక చేస్తే వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం అమ్మడికి అలవాటే.  ప్రస్తుతం అందరూ లాక్ డౌన్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి జ్వాలకు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైనున్న ఫోటో కూడా అలాంటిదే. బ్లాక్ టాప్.. పింక్ మిడ్డీ ధరించి సిమెంట్ కలర్ పుల్ ఓవర్ తో గ్లామరస్ గా కనిపిస్తోంది. చేతికి ఉన్న పచ్చబొట్టు.. చిట్టిపొట్టిగా ఎంతో క్యూట్ గా ఉన్న ఆ మిడ్డీ.. ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే జ్వాల సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అనిపిస్తోంది. నిజానికి జ్వాల కనుక బ్యాడ్మింటన్ ప్లేయర్ కాకుండా హీరోయిన్ అయి ఉంటే.. జనాల్లో ప్రేమ జ్వాలలు.. విరహ జ్వాలలు.. అభిమాన జ్వాలలను అవలీలగా రగిలించి ఉండేది.

గుత్తా జ్వాల 2005 లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకుంది.  కానీ  విభేదాల కారణంగా 2011 లో ఇద్దరూ విడిపోయారు. గత కొంతకాలంగా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్ తో సన్నిహితంగా మెలుగుతోంది.  త్వరలో పెళ్ళి చేసుకునేందుకు ఈ జంట రెడీ అవుతోందని కోలీవుడ్ మీడియాలో జోరుగా టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ జంట కూడా తమ  రిలేషన్ ను ఈమాత్రం దాచి పెట్టకుండా బహిరంగంగా ప్రదర్శిస్తూనే ఉంది.