Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మినీ డ్రెస్ లో మ్యాగ్జిమం అందాలు

By:  Tupaki Desk   |   10 Dec 2019 9:37 AM GMT
ఫోటో స్టోరీ: మినీ డ్రెస్ లో మ్యాగ్జిమం అందాలు
X
బాలీవుడ్ లో ఎంతమంది భామలు ఉన్నా వారిలో కత్రినా కైఫ్ మాత్రం ప్రత్యేకం. గ్లామర్.. స్టైల్.. క్రేజ్.. ఇలా ఏం అంశం తీసుకున్నా కత్రినాకు మంచి మార్కులే పడతాయి. నటన విషయంలో మొదట్లో వీక్ అయినప్పటికీ కత్రినా ఆ విషయంలో కూడా తనను తాను మెరుగుపరుచుకుంది. ఆయితే ఇప్పటికీ కొందరు కత్రిన నటన వీక్ అంటుంటారు.. అది వేరే సంగతి. అయితే సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఈతరం భామలకు గట్టి పోటీ ఇస్తోంది.

కత్రినకు ఇన్స్టాలో 30 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది. వారికోసం ఈమధ్య రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు 'వోగ్ నైకా ఫ్యాషన్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో కత్రినా ఒక చిట్టిపొట్టి సిల్వర్ కలర్ గౌన్లో మెరిసింది. నిజంగానే ఆ గౌన్ ధగధగా మెరుస్తోంది. స్లీవ్ లెస్ కావడంతో ఈ గౌన్ చాలా స్టైలిష్ గా ఉంది. వేళ్ళకు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుంది. చెవులకు హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ధరించింది. ఇతర యాక్సెసరీస్ ఏవీ ధరించకుండా సింపుల్ గా ఉంది. ఒక ఫోటోలో నడుముపై చేతులు పెట్టుకుని సూటిగా చూస్తోంది. మరో ఫోటోలో చిందరవందరగా ఉన్న జుట్టుతో డిఫరెంట్ పోజిచ్చింది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాదపు గా ఒక మిలియన్ లైక్స్ వచ్చాయి. "షార్ట్ డ్రెస్ సూపర్".. "బ్యూటిఫుల్ క్యాట్".. "బాలీవుడ్ ఏంజెల్".. "ఎప్పుడూ రాణివే" అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది.