ఫోటో స్టోరి: అనుష్క థై సౌందర్యం

Tue Oct 08 2019 18:04:19 GMT+0530 (IST)

Photo Story: Anushka Thai Beauty

ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ తర్వాతనే ఎవరైనా. సాటి కథానాయికల నుంచి పోటీ ఎంత ఉన్నా బాలీవుడ్ లో తనకంటూ ఓ స్థాయి ఉందని నిరూపించిన మేటి ప్రతిభావని. యూత్ అభిమానించే ఫ్యాషన్ ఐకన్ గా మెప్పు పొందింది. ఇటీవల ఓ అవార్డ్స్ వేడుకలో అనుష్క అప్పియరెన్స్ కి బోయ్స్ కి మతి చెడగొట్టిందంటే అతిశయోక్తి కాదు. విరాట్ కోహ్లీని పెళ్లాడి విరుష్కగా మారాక అనుష్క లో గ్లామర్ కంటెంట్ రెట్టింపైందనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం.దివినుంచి దిగొచ్చిన దేవకన్యలా అనుష్క కనిపించింది. వేడుక ఆద్యంతం నవ్వులు చిందిస్తూ అల్ట్రా మోడ్రన్ వధువు గెటప్ లో తళతళా మెరిసింది. వైట్ అండ్ వైట్ లో రాణీ హంసను తలపించింది. హాట్ కంటెంట్ లో ప్యారిస్  హంసలకే మతిచెడే ట్రీట్ ఇచ్చింది అమ్మడు. మేకప్ లెస్.. షార్ట్ హెయిర్ లుక్ లో.. ట్రెండీ హాఫ్ షోల్డర్ బ్రైడల్ గౌన్ లో అదిరిపోయింది. వేడుకలో  కాలు మీద కాలు వేసుకుని కూచుంది అనుష్క. ఆ గౌన్ కి లేసులు.. బాటమ్ లో చీలిక ఉన్న ఫ్రాకు స్టైల్ మతి చెడే ట్రీట్ ని ఇచ్చింది. ఇక ఈ వేడుకలో తనను విష్ చేసేందుకు స్నేహితుడు రణవీర్ సింగ్ అక్కడికి వచ్చాడు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

అనుష్క లుక్ పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తించారు. HOT అన్నది అండర్ స్టేట్ మెంట్! అంటూ సానియా మీర్జా విరుష్కకు కాంప్లిమెంట్ ఇచ్చింది. దీపిక పదుకొనే.. జరీన్ ఖాన్ సైతం స్మైలీ హార్ట్ ఈమోజీల్ని పోస్ట్ చేశారు.