Begin typing your search above and press return to search.

బిడియం ఒల‌కబోస్తున్న సౌభాగ్య‌వ‌తి!

By:  Tupaki Desk   |   23 May 2022 11:30 PM GMT
బిడియం ఒల‌కబోస్తున్న సౌభాగ్య‌వ‌తి!
X
హీరోయిన్ల ఫోటో సెష‌న్స్ లో మాగ్జిమ‌మ్ గ్లామ‌ర్ ఎలివేష‌న్సే ఉంటాయి. కొంత మంది బ్యూటీలైతే ప‌నిగ‌ట్టుకుని మ‌రీ వీలైనంత బోల్డ్ గా క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఆల్ర్టా మెడ్ర‌న్ లుక్ లో సైతం బోల్డ్ అటెంప్ట్ త‌ప్ప‌నిస‌రిలా మారిపోయింది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చి యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంటారు. కానీ ఆవ‌న్ని ఈ చిన్న‌దాని ముందు చిన్న‌బోయిన‌ట్లే క‌నిపిస్తుంది.

అవును అంత‌గా ఈ యువ నాయిక బిడియం ఒల‌క‌బోసి యువ‌త హృద‌యాల్ని తొలిచేస్తుంది. ఇలాంటి ఫోజ్ ఒక్క‌టిస్తే చాలు అలా ప‌డి ఉంటారు అనిపిస్తుంది. ఆ ఫోటో లో క‌నిపిస్తుంది రుహానీ శ‌ర్మ్. లెటెస్ట్ ఫోటో సెష‌న్ లో భాగంగా అమ్మ‌డు ఇలా మోకాళ్ల పై కూర్చుని సిగ్గు..బిడియం ఒల‌క‌బోస్తుంది. ప‌ర్పెక్ట్ బాడీ ఔట్ పిట్ లో హాట్ హాట్ గా క‌వ్విస్తూనే సొగ‌స‌రి సిగ్గ‌ర్ గా చిలిపి చిలిపిగా హైలైట్ అవుతుంది.

కొద్ది రోజుల‌గు రుహాని శ‌ర్మ ఫోటో సెష‌న్స్ తో బిజీగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో క్యామ్ కి ఫోజులిచ్చి యువ‌త‌లో ఫోక‌స్ అవుతుంది. అందాల ఆర‌బోత‌తో పాటు...ఆల్ర్టా మోడ్ర‌న్ బ్యూటీగాను కుర్రాళ్ల‌లో కాక‌లు పుట్టిస్తుంది. తాజా ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గామారింది. యువ‌త త‌మ‌దైన శైలి కామెంట్ల‌తో అభిమానం కురిపిస్తున్నారు.

చిల‌సౌ' సినిమాతోతెరంగేట్రం చేసిన సిమ్లా బ్యూటీ రుహాని శ‌ర్మ సుప‌ర‌చితురాలే. తొలి సినిమాతోనే స‌క్సెస్ ఖాతాల వేసుకుంది. అదే ఊపులో 'హిట్'..'డ‌ర్టీ హ‌రి' చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు అందుకుంది. 'హిట్' మంచి విజ‌యం సాధించింది. కానీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన బోల్డ్ అటెంప్ట్ 'డ‌ర్టీ హ‌రి' మాత్రం వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. న‌టిగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని మూవ్ అవుతుంది. ఇటీవ‌లే సెకెండ్ ఇన్నింగ్స్ ని పెళ్లికి ముందే ప్రారంభించ‌డానికి రెడీ అనేసింది. హీరోయిన్ గానే కాదు...నెగిటివ్ రోల్స్ వ‌చ్చినా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను అన్న సంకేతాలు పంపేసింది. పాత్ర న‌చ్చితే ఎలా న‌టించ‌డానికైనా సిద్ధం అనేసింది.

మ‌రీ ఈ భామ‌ని ప్రోత్స‌హించే ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఎంత మంది ఉంటారో. ఇక రుహానీ శ‌ర్మ బాలీవుడ్ పైనా కాన్సంట్రేట్ చేసింది. హిందీలో 'ఆగ్ర' సినిమాతో లాంచ్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే అక్క‌డ బిజీ అవుతుంద‌ని ధీమా క‌నిపిస్తుంది.