విక్కీ-క్యాట్ వెడ్డింగ్.. ఫోన్ లకు అనుమతి లేదు!

Thu Nov 25 2021 14:24:56 GMT+0530 (IST)

Phones are not allowed in Vicky Katrina wedding

కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ వివాహం డిసెంబర్ లో జరుగుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ లోని పోర్ట్ రిసార్ట్ లో పెళ్లి కోసం ప్లానింగ్ జరిగిందని కేవలం కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారని ప్రచారం ఉంది.



ముందుగా ముంబైలో రిజిస్టార్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకుని అటుపై రాజస్థాన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకూ వస్తున్న కథనాల్లో నిజానిజాలెంత? అబద్దం ఏంత? అన్నది క్లారిటీ లేదు.

కత్రినా-విక్కీ కౌశల్ ఇద్దరూ స్నేహితులు మాత్రమేనని చెప్పుకొచ్చిన జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు? అన్నదానిపైనా పూర్తి క్లారిటీ లేదు. అయినా ఈ పెళ్లికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ పెళ్లికి హాజరయ్యే వారు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదట. ఫోన్లను వేదిక వద్దకు తేకుండా నిషేధించారుట. దానికి సంబంధించి వెడ్డింగ్ నిర్వాహకులు ఓ టీమ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసారని గుసగుస వినిపిస్తోంది.

వాళ్ల ఆధ్వర్యంలో పెళ్లికి హాజరైన అతిధులందరినీ వేదికకు చేరుకోవడానికి ముందుగానే సిబ్బంది చేత తనిఖీలు చేయించి లోపలికి పంపిస్తారుట. ఈ విషయంలో మాత్రం కత్రినా-విక్కీ కౌశల్ కుటుంబం తరపున గట్టిగానే ఉన్నారట. పెళ్లికి కత్రిన తరపున విక్కీ తరపున ఇంపార్టెంట్ బంధువులు దిగుతారని దానివల్ల ప్రైవసీ మరికాస్త ఎక్కువగా కోరుకుంటున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది.

పెళ్లికి సంబంధించిన ఫోటోలుగానీ..వీడియోలు గానీ...ఇతర ఏ ఫోటోలు బయటకు వెళ్లకూడదని..ఒకవేళ లీక్ చేస్తే కుటుంబ సభ్యులే అధికారికంగా లీక్ చేయాలి తప్ప! బయట వ్యక్తుల ద్వారా పెళ్లి పోటోలు బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతా బాగానే ఉంది. డిసెంబర్లో వివాహం అంటున్నారు.

కానీ ఇప్పటివరకూ పెళ్లి తేది మాత్రం ఇంకా బయటకు రాలేదు సుమీ. అంటే కత్రినా-విక్కీ ఇద్దరు డేట్ విషయంలో ఇంకా ఇంకా గోప్యంగా వ్యవహరిస్తున్నారా? లేక ఇదంతా గాలి ప్రచారామేనా? అన్నది కూడా తేలాలి. ఇటీవలే ఈ జంట దర్శకుడు కబీర్ ఖాన్ నివాసంలో రోకా వేడుకను నిర్వహించారని ఫోటో ఆధారాల్ని మీడియా బయట పెట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.