ఎంబీబీఎస్ పరీక్షలు రాస్తున్న పెళ్లి సందD భామ

Mon Nov 29 2021 09:26:00 GMT+0530 (IST)

Pelli Sandhya D Actress writing MBBS exams

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన `పెళ్లి సందడి` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల. తొలి సినిమాతో అమ్మడు మంచి పెర్పార్మర్ గా నిరూపించుకుంది. సినిమా కమర్శియల్ గా పెద్ద సక్సెస్ కానప్పటికీ శ్రీలీలకు మంచి పేరొచ్చింది. ఆ క్రేజ్ తోనే యంగ్ హీరోయిన్ కి ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయి.మీడియం రేంజ్ హీరోలు సహా పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఆఫర్లు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సినిమాలతో బిజీ అయ్యే ముందు ఎంబీబీఎస్ పరీక్షలు పూర్తిచేయనుందని తెలుస్తోంది. ఎంబీబీఎస్ చదువుతుండగా శ్రీలీలకు పెళ్లి సందడిలో అవకాశం రావడంతో ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చింది.

షూటింగ్ పూర్తయ్యే వరకూ ఇక్కడే ఉంది. అయితే ఇప్పుడు కాబోయే డాక్టరమ్మకు పరీక్షలు దగ్గరపడటంతో సినిమా రిలీజ్ అనంతరం మళ్లీ ముంబై వెళ్లిపోయింది. ప్రస్తుతం స్టడీస్ పైనే కాన్సంట్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ పరీక్షలు అంటే మొక్కవోని దీక్షతో చదవాలి.

ఈ క్రమంలో పరీక్షలు పూర్తయ్యే వరకూ మనసు నుంచి సినిమాలో ఆలోచల్ని తీసేసి పర్తిగా చదువుపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలు పాటు ముంబైలోనే ఉంటుందని సమచారం. మళ్లీ పరీక్షలు పూర్తయిన అనంతరం హైదరాబాద్ కి తిరిగి రానుందని తెలుస్తోంది.

ఇక శ్రీలీల అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే మాస్ రాజా రవితేజ కథనాయకుడిగా నటించనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఈ భామనే ఎంపిక చేసినట్లు సమాచారం. అమ్మడిలో డాన్స్ స్కిల్ చూసి కొంత మంది మీడియం రేంజ్ హీరోలు శ్రీలీలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే అగ్ నిర్మాణ సంస్థలు యంగ్ బ్యూటీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.