ఘాటైన ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసిన పాయల్

Fri Jan 22 2021 08:00:01 GMT+0530 (IST)

Payal choked with intense kisses

ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. వెంకీమామ తరవాత ఇటీవల అనగనగా ఓ అతిథి అనే సినిమాలో నటించి కంబ్యాక్ అయ్యింది. ఇందులో తన పాత్రకు నటనకు మంచి పేరు వచ్చింది. కానీ క్రేజీ ఆఫర్ అయితే ఏదీ లేదు. `సీత`మూవీలో ఐటెమ్ నంబర్ తరహాలో మళ్లీ అలాంటి ఓ ఆఫర్ వచ్చింది. అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న `మహాసముద్రం` లో పాయల్ ఓ ఐటెమ్ సాంగ్ చేయనుంది. ఇందులో శర్వానంద్- సిద్ధార్థ్- అదితి రావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కథలో భాగంగా వచ్చే ప్రత్యేక గీతంలో పాయల్ కి ఆఫర్ దక్కింది.పాయల్ ఇన్ స్టా మాధ్యమంలో నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు ట్రీటిస్తోంది. తాజాగా  పాయల్ రాజ్‌పుత్ ఆపకుండా ముద్దులిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.ఎద ఎత్తులను ఎక్స్‌పోజ్ చేస్తూ ఘాటైన కిస్సులతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆ ముద్దులకు కుర్రకారు పరేషాన్ అయిపోతున్నారు.

 అది తట్టుకోలేని కొందరు యూత్ అవన్నీ మీ బోయ్ ఫ్రెండ్ కేనా..అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్నట్టు అన్ని ముద్దులెవరికిచ్చిందో పాయల్ కే తెలియాలి. ఇంతకీ తన పంజాబీ బోయ్ ఫ్రెండ్ కేనా? అతడితో ఫోటోషూట్లను రిలీజ్ చేసి తాను ఆల్రెడీ లాక్డ్ అని ఫీలర్స్ వదిలిన పాయల్ మళ్లీ ఎందుకిలా పబ్లిగ్గా లిప్ కిస్సులతో రెచ్చిపోతోంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. దేనికైనా పాయలే ఆన్సరివ్వాల్సి ఉంటుంది