Begin typing your search above and press return to search.

ఆది సరసన పాయల్ రాజపుత్ కొత్త సినిమా..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 3:30 AM GMT
ఆది సరసన పాయల్ రాజపుత్ కొత్త సినిమా..!
X
సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా హీరోగా సెటిల్ అయ్యేందుకు చాలామంది ట్రై చేస్తూనే ఉంటారు. కొందరి విషయంలో పదేళ్లు దాటినా ప్రయత్నాలు మాత్రం ఆపరు. కెరీర్ ప్రారంభంలో హిట్స్ పడి ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలే ఖాతాలో పడితే కొందరు ప్రయత్నాలు కూడా మానేసే సందర్భాలు చూసాం. కానీ సినిమా ఇండస్ట్రీతో తరతరాల సంబంధం ఉండేసరికి అవకాశాలకు కొదవ ఉండదని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు యువహీరో ఆది సాయికుమార్. సాయికుమార్ తనయుడుగా 2011లో ప్రేమకావాలి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు.

ఫస్ట్ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవ్వడంతో ఎంట్రీ బాగానే జరిగిందని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రెండో సినిమా లవ్లీ కూడా బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయం అందుకుంది. ఆదికి ఇంకా తిరుగులేదని అనుకున్నారు. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. ప్రేమకావాలి, లవ్లీ సినిమాల తర్వాత ఇన్నేళ్లలో ఒక్క సరైన హిట్టు పడలేదు. ఇటీవలే శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు ఆది.

ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి బోల్డ్ బ్యూటీ పాయల్ రాజపుత్ హీరోయిన్ గా 'కిరాతక' అనే సినిమా ప్రకటించాడు. అయితే ఈ సినిమాను పూలరంగడు - చుట్టాలబ్బాయి ఫేమ్ వీరభద్రం తెరకెక్కించునున్నాడు. ఇదివరకు ఆదితో వీరభద్రం 'చుట్టాలబ్బాయ్' సినిమా తీసాడు. ఇప్పుడు సెకండ్ మూవీగా వీరి కాంబినేషన్ లో 'కిరాతక' రాబోతుంది. విజన్ సినిమాస్ బ్యానర్ లో నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఆది సరసన పాయల్ రాజపుత్ హీరోయిన్ అనేసరికి ఒక్కసారిగా ఇండస్ట్రీలో కిరాతక హాట్ టాపిక్ అయింది. మరి సినిమా కూడా పేరుకు తగ్గట్టుగానే క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఉండబోతుందని తెలిపాడు డైరెక్టర్ వీరభద్రం. చూడాలి మరి ఈసారి ఆదికి హిట్ పడుతుందేమో!