వీడియో: పాయల్ టూమచ్ బోల్డ్ అవతార్

Mon Nov 29 2021 16:47:21 GMT+0530 (IST)

Payal Rajput Shared latest video in Insta

RX 100 చిత్రంతో బోల్డ్ బ్యూటీగా పాపులరైన పాయల్ రాజ్ పుత్  తెలుగు సినిమా హాటెస్ట్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా వేదికలపై వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది.తాజాగా మరో హాటెస్ట్ ఫోటోషూట్ ని పాయల్ షేర్ చేసింది. ఈసారి మరింత బోల్డ్ అవతార్ తో షాకిచ్చింది పాయల్. ఎల్లో జంప్ సూట్ ధరించి ఎద అందాలను ఆవిష్కరిస్తూ మత్తెక్కించింది ఈ పంజాబీ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమానులు దీనిని జోరుగా వైరల్ చేస్తున్నారు.

పాయల్ ఈ కొత్త లుక్ లో నెవ్వర్ బిఫోర్ అనేంత అందంగా కనిపించింది. సదరు పంజాబీ బ్యూటీ చివరిగా `ఆహా`లో తెలుగు వెబ్ సిరీస్ `3- రోజెస్`లో కనిపించింది. ప్రస్తుతానికి ఈ కొత్త వీడియో నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. పాయల్ ప్రస్తుతం యాంజెల్ - కిరాతక - హెడ్ బుష్ అనే చిత్రాల్లో నటిస్తోంది.

కెరీర్ లో స్పెషల్ రోల్ ..!

కన్నడలో పాయల్ ఓ డాన్ స్టోరీలో నటిస్తోంది. బెంగుళూరు సిటీని మొట్ట మొదటగా గడగడలాడిండించిన జయరాజ్ బయోపిక్ `హెడ్ బుష్` టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో డాన్ మొదటి గాళ్ ప్రెండ్ పాత్రలో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. జయరాజ్ కి చాలా మంది గాళ్ ప్రెండ్స్ ఉండగా పాయల్ పోషించే పాత్ర మాత్రం చాలా కీలకమైనది. డాన్ జీవితంలో కొన్ని మార్పులు సైతం తీసుకొచ్చిన రోల్ అది. ఈ నేపథ్యంలో పాయల్ పాత్రకు మంచి పేరొచ్చే అవకాశం ఉంది.