మామకు.. అల్లుడికి ఇద్దరికీ ఐ లవ్ యూ చెప్పేసిందే!

Sun Dec 08 2019 17:18:25 GMT+0530 (IST)

Payal Rajput Says I Love U To Venkatesh

వెంకటేష్ - నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ'. నిజ జీవితంలోని మేనమామ అల్లుళ్ల పాత్రలనే వెంకీ.. చైతూలు ఈ సినిమాలో పోషిస్తుండడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.  ఇప్పటివరకూ విడుదలైన ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈమధ్య 'వెంకీమామ' ప్రీరిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.పాయల్ మాట్లాడుతూ వెంకటేష్ గారి లాంటి హీరోతో నటించే అవకాశం ఇంత త్వరగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.  "వెంకీ సర్ ఐ లవ్ యూ.. మనందరం ఆయనను ప్రేమిస్తాం.. నిజం కదా" అని ప్రేక్షకులను సర్ ప్రైజ్  చేసింది. అంతలో రాశి మైక్ అందుకుంటూ "వెంకీ సర్.. వుయ్ లవ్ యూ సర్" అంటూ తనవైపు నుంచి కూడా లవ్ యూ చెప్పేసింది.  పాయల్ కంటిన్యూ చేస్తూ "సర్.. నేను మీ అభిమానిని.  మీలాంటి వారితో నా కెరీర్ ఆరంభంలో నటించడం నేను ఎంతో అదృష్టంగా.. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను." అంటూ వెంకీ పై అభిమానాన్ని కురిపించింది.

షూటింగ్ లో మొదటి రోజు కొంచెం నెర్వస్ గా ఉన్నానని అయితే వెంకటేష్ గారు ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించారని..  షూటింగ్ ఎంతో ఈజీగా ఉండేలా అనిపించిందని.. దీంతో వెంకీ సర్ పై తనకు గౌరవం చాలా పెరిగిందని చెప్పుకొచ్చింది పాయల్.  చైతు గురించి మాట్లాడుతూ ఎక్కువ సార్లు చైతన్యతో మాట్లాడలేదు కానే చైతన్య ఒక జెంటిల్మెన్ అని కితాబిచ్చింది.   "ఐ లవ్ యూ టూ" అంటూ అల్లుడికి కూడా ఐ లవ్ యూ చెప్పేసింది.