పాయల్ చెమటలు పట్టించేస్తోందిగా

Mon Jan 17 2022 10:17:20 GMT+0530 (IST)

Payal Rajput Latest Photoshoot

సెలబ్రిటీ వరల్డ్ లో స్వేధం చిందిస్తూ నిరంతరం ఫిట్నెస్ కోసం పాకులాడే భామలకు కొదవేమీ లేదు. నేటి జనరేషన్ తీరైన రూపం కోసం హార్డ్ వర్క్ చేసేందుకు వెనకాడడం లేదు. జిమ్ లో నిరంతరం చెమటలు పట్టేలా వర్కవుట్లు చేసి ఆ ఫోటోలు వీడియోలను అభిమానులకు షేర్ చేస్తున్నారు పలువురు నాయికలు.ఇటీవలి కాలంలో ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వరుస ఫోటోషూట్లతో హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. జిమ్ లో స్వేధం చిందిస్తూ పాయల్ షేర్ చేస్తున్న ఫోటోలు వీడియోలకు బోలెడంత క్రేజ్ ఉంది యూత్ లో. తాజాగా మరోసారి పాయల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన ఈ వీడియో అంతే వైరల్ గా మారింది. అప్పుడే కసరత్తులు చేసి చెమటలతో తడిసిపోయిన దేహశిరుల్ని పాయల్ ఎంతో సొంపుగా ఆవిష్కరిస్తోంది ఈ వీడియోలో. ఇది చూడగానే.. చెమటలు చిందించడమే కాదు.. యూత్ కి చెమటలు పట్టించడమెలాగో పాయల్ నే అడగాలి అంటూ జోరుగా కామెంట్లు పడిపోతున్నాయ్.

పాయల్ కి ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ సినిమాలకు సంతకాలు చేస్తోందని సమాచారం. వీటితో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు మాతృభాష పంజాబీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు బోయ్ ఫ్రెండ్ తో వరుస ఫోటోషూట్లను టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ చేయడం ద్వారా హాట్ టాపిక్ గా మారుతోంది.