మైండ్ బ్లాక్ చేయడం పాయల్ హ్యాబిట్

Wed Nov 24 2021 22:00:01 GMT+0530 (IST)

Payal Rajput Latest Photo

దిల్లీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నెమ్మదిగా ప్లానింగ్ పరంగా షార్పెన్ అవుతూ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో తన ఫాలోయింగ్ ని పెంచుకోవడంలో ఈ బ్యూటీ బిగ్ సక్సెస్ అందుకుంటోంది. ముఖ్యంగా  టెంప్టింగ్  ఫోటోలతో హీటెక్కించడం .. కెరీర్ ఆరంభం నుంచి ఆందాల ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. డెబ్యూ మూవీతోనే యూత్ కలల రాణిగా మారింది. తొలి చిత్రంతోనే బోలెడంత పాపులారిటీ దక్కించుకుంది. అటుపై సోషల్ మీడియాలతో మరింతగా ఫోకస్ అయింది.  ప్రస్తుతం నటిగా పాయల్ కెరీర్ హ్యీపీగానే సాగిపోతోంది. తాజాగా మరో టెప్టింగ్ ఫోటోషూట్ తో ఇన్ స్టా ని షేక్ చేస్తోంది. బ్లాక్ స్కిన్ టైట్ దుస్తులు ధరించి బాటమ్ లో  డిజైన్ ఫ్యాంట్ ధరించింది.  పాయల్ భిన్న కోణాల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు  ప్రస్తుతం ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. పాయల్ ఫాలోవర్స్  ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇక పాయల్ కెరీర్ విషయానికి వస్తే  `ఆర్ ఎక్స్ 100`  సినిమాతో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చిన సంగతి  తెలిసిందే. అటుపై  కొంత మంది అగ్ర హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఓటీటీ ఆఫర్లు కలిసొస్తున్నాయి. అటు పంజాబీలో  కోలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది. అలాగే కన్నడలో ఓ డాన్ స్టోరీలో నటిస్తోంది.

బెంగుళూరు సిటీని మొట్ట మొదటగా గడగడలాడిండించిన  జయరాజ్ బయోపిక్ `హెడ్ బుష్` టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇందులో డాన్ మొదటి గాళ్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తోంది. జయరాజ్ కి చాలా మంది గాళ్ ప్రెండ్స్  ఉండగా పాయల్ పోషించే పాత్ర మాత్రం చాలా కీలకమైనది. డాన్ జీవితంలో కొన్ని మార్పులు సైతం తీసుకొచ్చిన రోల్ అది. ఈ నేపథ్యంలో పాయల్ పాత్రకు మంచి పేరొచ్చే అవకాశం ఉంది.