పాయల్ మత్తు చల్లే రిలాక్స్ థెరపీ..!

Thu Jun 17 2021 08:00:01 GMT+0530 (IST)

Payal Rajput Latest Photo

ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ తీరిక సమయాల్లో తెలివైన ప్రణాళికలతో దూసుకెళుతోంది. ఇటీవల లాక్ డౌన్ సీజన్ లో ఈ బ్యూటీ ఇన్ స్టా మాధ్యమంగా వరుస ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది. ఒక రకంగా లక్షలాదిగా ఉన్న తన అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతోంది.తాజాగా మరో హాట్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. పాయల్ అలా కళ్లు మూసుకుని కూల్ గా ఓచోట కూర్చుని రిలాక్సయిపోతున్న తీరు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. సింపుల్ గా డిజైనర్ టాప్ .. పొట్టినిక్కరు ధరించి అలా రిలాక్సవుతుంటే పాయల్ థై సొగసుల ఎలివేషన్ మత్తు చల్లుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

గత కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాల్లేని పాయల్ కి బంగార్రాజులో ఐటెమ్ నంబర్ లో ఆఫర్ కల్పిస్తున్నారని ప్రచారమవుతోంది. మరోవైపు ఆర్.ఎక్స్ 100తో తనని తెలుగుతెరకు పరిచయం చేసిన అజయ్ భూపతి  మరో ఆఫర్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి. త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ పాయల్  నెగెటివ్ పాత్రలో నటిస్తోంది