అరెరే! రంగుల వలయంలో చిక్కుకుపోయిన పాయల్!!

Thu Jun 10 2021 14:00:01 GMT+0530 (IST)

Payal Rajput Latest Photo

తనదైన అందం వేడెక్కించే నటనతో కుర్రాళ్లను తన గాలానికి చుట్టేసి ఒక వింతైన వలయంలో చిక్కుకునేలా చేసింది పాయల్ రాజ్ పుత్. ఈ పంజాబీ బ్యూటీ కి ఇటీవల టాలీవుడ్ లో పెద్దగా  ఆఫర్లు దక్కకపోయినా తెలివిగా ద్వితీయ శ్రేణి ఆఫర్లను దక్కించుకుంటోంది. అటు తమిళం పంజాబీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇరుగు పొరుగు పరిశ్రమల్ని ఆకర్షించేందుకు వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ .. కళాత్మకంగా డిజైన్ చేసినది. నగరం ఔట్ స్కర్ట్స్ లో ఒక నిర్మాణంలో ఉన్న తూము (సిమెంట్ వలయం)లో  పాయల్ ఇలా డిజైనర్ లుక్ తో కనిపించింది. ఇక తన డ్రెస్ ని గ్రాఫిటీ కలర్స్ తో మిక్స్ చేసిన తీరు ఆసక్తికరం.

అల్లంత దూరంగా కనిపిస్తున్న పైప్ లైన్ కి బ్లూ కలర్ ని అద్ది.. వలయంలోనూ థిన్ లైన్ అంచుకు బ్లూ షేడ్ ఇచ్చి ఎంతో కాన్సెప్ట్యువల్ గా ఈ ఫోటోషూట్ ని తీర్చిదిద్దిన వైనం ఆకర్షించింది. ఇక పాయల్ అందచందాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ పొట్టి ఫ్రాకులో పాయల్ ఎంతో క్యూట్ గా లవ్ లీగా కనిపిస్తోంది. అలా థై సొగసుల ఎలివేషన్ హాట్ నెస్ ని పెంచింది. అన్నట్టు ఆర్.ఎక్స్ 100 దర్శకుడితో పాయల్ మరో సినిమా చేస్తోందని ప్రచారమైంది. దానికి సంబంధించిన అప్ డేట్ ఇంకా రావాల్సి ఉంది. కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్ సరసన యాంజెల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతోంది.