పాయల్ అలా బటన్ విప్పేస్తే ఛాన్సులిస్తారా?

Thu Apr 22 2021 09:00:02 GMT+0530 (IST)

Payal Rajput Latest Photo

బటన్ లెస్ ఫోజులు ఇటీవల ట్రెండీ టాపిక్. అందాల కథానాయికలు ఫోటోషూట్ల కోసం ఎలాంటి వేషానికైనా సై అనేస్తున్నారు. ఇంతకుముందులా మడిగట్టుకుని కూచునే పరిస్థితి లేదు. ఇప్పుడు ముంబై క్యాట్ వాక్ భామలకు ధీటుగా ఇతర పరిశ్రమల భామలు కూడా బోల్డ్ లుక్ తో కనిపించేందుకు వెనకాడడం లేదు.డీప్ గా ఇన్నర్ అందాల్ని ఎలివేట్ చేయడం... బాటమ్ లైన్ లో బటన్ లెస్ గా ఫోజులివ్వడం రెగ్యులర్ గా చూస్తున్నవే. హీట్ పెంచే ఫోటోషూట్లకు నవతరం భామలు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాల్లో అంతే వేగంగా వైరల్ అయిపోతున్నాయి. ఇవి సోషల్ మీడియాల ద్వారా సదరు నాయికల ప్రకటనల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. లక్షల్లో ఫాలోవర్స్ ని బట్టి కార్పొరెట్ ఉత్పత్తుల కంపెనీలు భారీ మొత్తాల్ని చెల్లిస్తున్నాయి.

ఇప్పుడు ఈ తరహా బోల్డ్ ఫోటోషూట్లలో పాయల్ కూడా బిజీ. గత కొంతకాలంగా వేడెక్కించే ఫోటోషూట్లతో ఇన్ స్టా అభిమానుల్ని అలరిస్తున్న పాయల్ ఈ వేదికపై ప్రకటనల్ని షేర్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది. ఈ భామ తాజా ఫోటోషూట్ లో మరో మెట్టు ఎక్కి బటన్ లెస్ ఫోజుతో చెలరేగింది.

అలా డెనిమ్ జీన్స్ బటన్ ని రిమూవ్ చేసింది పాయల్. స్కై బ్లూ కలర్ టాప్ .. కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ డెనిమ్స్ తో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న పాయల్ బటన్ లెస్ యాక్ట్ తో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. అందాల పాయల్ హెయిర్ డిజైన్ సహా ప్రతిదీ ఎంతో అబ్బురపరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

పాయల్ కి ఇటీవల తెలుగులో ఆఫర్లు తగ్గాయి. అజయ్ భూపతితో ఓ సినిమాకి కమిటైందని కథనాలొచ్చినా.. దానిపై అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఆ క్రమంలోనే పంజాబీలో ఓ సినిమాకి సంతకం చేసింది. ఇటీవలే ఈ సినిమా మొదలైంది.