Begin typing your search above and press return to search.

జిన్నా ప్రేయసి పచ్చళ్ళ స్వాతి వచ్చేసింది..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 9:44 AM GMT
జిన్నా ప్రేయసి పచ్చళ్ళ స్వాతి వచ్చేసింది..!
X
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''జిన్నా''. ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హాట్ భామలు పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో విష్ణు కనిపించనున్నారు.

ఇటీవలే 'జిన్నా' టైటిల్ ను ఆవిష్కరించిన మేకర్స్.. విష్ణు ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ ని వదిలారు. ఇందులో ఆమె పచ్చళ్ల స్వాతి అనే క్యారక్టర్ లో కనిపించనున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరికి జీవితంలో ఒంటరిగా సిల్లీ పనులను చేయనివ్వని ఒక ఫ్రెండ్ కావాలి. జిన్నా భాగస్వామి "స్వాతి"గా పాయల్ రాజ్‌ పుత్‌ ను పరిచయం చేస్తున్నాం అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

ఫస్ట్ లుక్ లో పాయల్ రెడ్ కలర్ హాఫ్ శారీలో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ గ్లామర్ రోల్స్ లో నటిస్తూ వచ్చిన అందాల భామ.. 'జిన్నా' సినిమాలో సంప్రదాయకంగా కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్ ని బట్టి తెలుస్తుంది.

'Rx 100' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. ఫస్ట్ సినిమాతోనే తన హాట్ హాట్ అందాలతో యువ హృదయాలను కొల్లగొట్టింది. దీంతో క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపు తడతాయని అందరూ భావించారు. అయితే విక్టరీ వెంకటేష్ - రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఇప్పుడు మంచు విష్ణు సినిమాతోనైనా ఈ బ్యూటీ కెరీర్ ట్రాక్ లో పడుతుందేమో చూడాలి.

'జిన్నా' చిత్రాన్ని మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కోన వెంక‌ట్ క‌థ‌ - స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రభుదేవా - గణేష్ ఆచార్య - ప్రేమ్ రక్షిత్ వంటి పాపులర్ డ్యాన్స్ మాస్టర్స్ ఈ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో 'జిన్నా' సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.