Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: డిస్కో రాజా లో పాయల్ ఇంటెన్స్ లుక్

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:33 AM GMT
ఎక్స్ క్లూజివ్:  డిస్కో రాజా లో పాయల్ ఇంటెన్స్ లుక్
X
మాస్ మహారాజా రవితేజ లాస్ట్ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' పోయినేడాది నవంబర్లో రిలీజ్ అయింది. ఇప్పటివరకూ రవితేజ నటించిన మరో చిత్రం విడుదల కాలేదు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ అందరూ కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి పాయల్ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తుపాకి పాఠకుల కోసం ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్నాం.

ఈ ఫస్ట్ లుక్ లో ఖాకి రంగు డ్రెస్ లో ఇంటెన్స్ లుక్ లో ఉన్న పాయల్ ఎవరికో పిస్టల్ గురిపెట్టింది. ఎప్పుడూ సరదాగా.. లేకపోతే హాటుగా ఉండే ఈ ఆరెక్స్ భామ ఏం మిషన్ పై ఉందో ఎందుకు.. ఎవరికి అలా తుపాకి ని గురిపెట్టిందో మనకు సినిమా చూస్తే కానీ తెలిసే అవకాశం లేదు. పాయల్ మొదటి సినిమా 'RX100' తోనే నటన విషయంలో మంచి మార్కులు తెచ్చుకుంది కాబట్టి ఈ సినిమాలో కూడా ఏదో ఒక పవర్ఫుల్ రోల్ చేస్తోందని ఈ పోస్టర్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. మరి ఈ సినిమాతో పాయల్ కు మంచి హిట్ దక్కుతుందో లేదో వేచి చూడాలి.

ఈ సినిమాలో తాన్యా హాప్.. బాబీ సింహా.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిస్కో రాజా చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.