ఫోటో స్టొరీ: పాయల్.. దుమ్ము దుమారమే!

Mon Sep 16 2019 14:10:48 GMT+0530 (IST)

Payal Rajput In RDX Love

'RX100' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించిన భామ పాయల్ రాజ్ పుత్.  మొదటి సినిమాతోనే బోల్డ్ భామ టాగ్ తెచ్చుకున్న ఈ భామ తాజాగా 'RDX లవ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో తేజస్ హీరోగా నటిస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఒకవైపు బోల్డ్ గా ఉందనే విమర్శలు ఉన్నా యూత్ ను ఆకర్షించడంలో ప్రోమోస్ విజయం సాధించాయి.ఇక 'RDX లవ్' టీమ్ కూడా హాటు పోస్టర్లతో సినిమాపై బజ్ ను మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది.  తాజాగా ఈ సినిమా నుండి మరో ఘాటు పోస్టర్ ను విడుదల చేసింది 'RDX లవ్' టీమ్. ఈ పోస్టర్ లో పాయల్ ఒక బండరాయిపై నిలుచుని సెక్సీ పోజిచ్చింది.  గ్రీన్ కలర్ ఛోళి.. అదే కలర్ లో ఉన్న లెహెంగా ధరించింది.  సాధారణంగా హాట్ డ్రెస్ అంటే ఒక థై స్లిట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేది RDX బ్యూటీ కావడంతో హాట్ నెస్ కోసం.. ఈ డ్రెస్ ను డిజైన్ చేసిన డిజైనర్ ఎడాపెడా కత్తిరించి యమా హాటుగా మార్చాడు. ఇక పాయల్ తన అందాలను ధారపోస్తూ.. ఒక ఖజురహో శిల్పంలాగా నిలుచుంది.

ఈ సినిమాలో నరేష్.. ఆమని.. ముమైత్ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం రాధన్.  రామ్ ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను  అక్టోబర్ 11 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.