అమ్మడి ఆ రెండు పెద్ద ఆఫర్లు పుకార్లేనట!

Sun Jul 05 2020 12:00:02 GMT+0530 (IST)

Payal Rajput Gives Clarity On about Offers

ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పూత్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 లో ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందుతున్న పుష్ప చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఉన్నట్లుండి రెండు బిగ్గెస్ట్ చిత్రాల్లో నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ రెండు సినిమాలకు సంబంధించి ఎవరు నన్ను సంప్రదించలేదు. ఒక వేళ అలాంటి సదావకాశం వస్తే తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానంటూ పేర్కొంది. దీంతో అమ్మడి ఫ్యాన్స్ అంతా ఉసూరుమంటున్నారు.

సీత చిత్రంలో ఐటెం సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్ పూత్ కు ఐటెం సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయట. కాని చిన్న సిసిమాల్లో ఐటెం సాంగ్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదట. ఈ రెండు సినిమాల్లో కాకున్నా రాబోయే రోజుల్లో అయినా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తాయో చూడాలి. మొదటి సినిమాతోనే గ్లామర్ తో పాటు నటిగా కూడా మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది.